HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Icc T20 Wc Squad With Ravindra Jadeja Almost Out Axar Patel Set To Get Ticket To World Cup

ICC T20 WC Squad: వరల్డ్ కప్ కు జడేజా స్థానంలో ఎవరు ?

ప్రస్తుతం ఆసియాకప్ లో బిజీగా ఉన్న టీమిండియాకు టోర్నీ మధ్యలో షాక్ తగిలింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో తప్పుకోవాల్సి వచ్చింది.

  • By Naresh Kumar Published Date - 02:12 PM, Sun - 4 September 22
ICC T20 WC Squad: వరల్డ్ కప్ కు జడేజా స్థానంలో ఎవరు ?

ప్రస్తుతం ఆసియాకప్ లో బిజీగా ఉన్న టీమిండియాకు టోర్నీ మధ్యలో షాక్ తగిలింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అతని స్థానంలో అక్షర్ పటేల్ కు అవకాశం దక్కింది. అయితే గాయం తీవ్రంగానే ఉండడంతో సర్జరీ జడేజా చేయించుకోనున్నాడు. మోకాలి గాయానికి సర్జరీ కారణంగా చాలా రోజుల పాటు మైదానానికి దూరం కానున్నాడు జడ్డూ. అధికారిక ప్రకటన లేకున్నా జడేజా దాదాపు 5 నుంచి 6 నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశముంది. టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు భారత్ కు ఇది గట్టి ఎదురుదెబ్బే.

ఎందుకంటే షార్ట్ ఫార్మేట్ లో జడేజా లాంటి ఆల్ రౌండర్ ఖచ్చితంగా జట్టులో ఉండాలి. జడేజా ఇందులో దేశీయ ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ, ఐపీఎల్ గేమలన్నీ కలిపి 897 వికెట్లను పడగొట్టాడు. అంతేకాకుండా అన్నీ పార్మాట్లలో కలిపి 13 వేల పరుగులు చేశాడు. బంతి, బ్యాట్ తోనే కాదు జడేజా ఫీల్డింగ్ లోనూ అదరగొడతాడు. ప్రస్తుతం గాయంతో అతను వరల్డ్ కప్ కు కూడా దూరం కానున్న నేపథ్యంలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జడేజా స్థానం కోసం రేసులో ముందున్నాడు అక్షర్ పటేల్. దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ నిలకడగా రాణించే అక్షర్ పటేల్ బంతితోనే కాదు బ్యాట్ తోనూ సత్తా చాటుతున్నాడు. లోయర్ ఆర్డర్ లో అక్షర్ పటేల్ లాంటి హిట్టర్ ఉంటే బ్యాటింగ్ మరింత బలంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

దీంతో వచ్చే వరల్డ్ కప్ కు జడేజా స్థానంలో అక్షర్ కే చోటు దక్కుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆసియాకప్ లో జట్టుతో కలిసి అక్షర్ ఈ టోర్నీలో సత్తా చాటితే వరల్డ్ కప్ టీమ్ లో బెర్త్ దక్కించుకోవచ్చు. ఐపీఎల్ లో 101 వికెట్లు , 25 అంతర్జాతీయ టీ ట్వంటీల్లో 21 వికెట్లు పడగొట్టిన అక్షర్ బ్యాట్ తోనూ రాణిస్తున్నాడు. ఐపీఎల్ లో 1135 రన్స్ చేశాడు.

Tags  

  • axar patel
  • ICC T20 WC Squad
  • ravindra jadega
  • team india

Related News

Jasprit Bumrah: బూమ్రా కంటే మా షాహీనే గొప్ప బౌలర్: రజాక్

Jasprit Bumrah: బూమ్రా కంటే మా షాహీనే గొప్ప బౌలర్: రజాక్

వీలు దొరికినప్పుడల్లా భారత్ క్రికెట్ పైనా, భారత క్రికెటర్ల పైనా నోరు పారేసుకోవడం పాకిస్థాన్ మాజీ ఆటగాళ్ళకు మామూలే. ఒక్కోసారి వారి మాటలు కోటలు దాటుతుంటాయి. హద్దు మీరి వ్యాఖ్యలు చేసి భారత అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటారు. తాజాగా పాక్ మాజీ బౌలర్ భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా (Jasprit Bumrah)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  • BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్ లో వారికి ప్రమోషన్ ఖాయమే

    BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్ లో వారికి ప్రమోషన్ ఖాయమే

  • Team India: జయహో భారత్.. తొలి అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ సొంతం

    Team India: జయహో భారత్.. తొలి అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ సొంతం

  • IND vs NZ: నేడే రెండో టీ20.. టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్

    IND vs NZ: నేడే రెండో టీ20.. టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్

  • U19 Women T20 World Cup 2023: రేపు ఇంగ్లాండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. కప్ కొట్టేదెవరో..?

    U19 Women T20 World Cup 2023: రేపు ఇంగ్లాండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. కప్ కొట్టేదెవరో..?

Latest News

  • Fake Currency : కోల్‌క‌తా భారీగా న‌కిలీ కరెన్సీ ప‌ట్టివేత‌.. పోలీసులు అదుపులో ఇద్ద‌రు నిందితులు

  • Gandhi burned: దేశమా సిగ్గుపడు.. గాంధీని కాల్చి, గాడ్సే కు జైకొట్టి!

  • YSRCP MLA’S : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ మంట‌లు.. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై అధిష్టానం నిఘా..!

  • Kuppam : కుప్పం మున్సిపల్ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించిన వైసీపీ కౌన్సిల‌ర్లు.. కార‌ణం ఇదే..?

  • Thalapathy 67: ‘మాస్టర్’ కాంబినేషన్ మళ్లీ రిపీట్.. భారీ స్టార్ కాస్ట్ తో విజయ్ మూవీ!

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: