ICC Rules : వన్డేలలో రెండు కొత్త రూల్స్. ఐసీసీ గ్రీన్ సిగ్నల్
ICC Rules : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వన్డే మ్యాచ్‌ల కోసం రెండు కీలకమైన కొత్త నిబంధనలను ఆమోదించింది.
- By Kavya Krishna Published Date - 01:30 PM, Sun - 15 June 25

ICC Rules : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వన్డే మ్యాచ్‌ల కోసం రెండు కీలకమైన కొత్త నిబంధనలను ఆమోదించింది. ఈ మార్పులు 2025 జూలై నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ద్వారా బౌలర్లు-బ్యాట్స్‌మెన్ మధ్య సమతుల్యతను తిరిగి తీసుకురావడమే కాకుండా, ఆటగాళ్ల భద్రతను మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో చేపట్టబడ్డాయి.
ఒక్కే బంతి రూల్ (Single Ball Rule): ప్రస్తుతం వన్డే మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి రెండు కొత్త బంతులు వాడుతున్నారు—ప్రతి ఎండ్ నుంచి ఒక్కొక్కటి. కానీ జూలై 2025 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధన ప్రకారం, 1 నుంచి 34 ఓవర్ల వరకే రెండు బంతులు ఉపయోగిస్తారు. 35వ ఓవర్లు వచ్చేసరికి ఫీల్డింగ్ జట్టు రెండు బంతుల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుని మిగిలిన 16 ఓవర్లు అదే బంతితో కొనసాగించాలి. వర్షం వల్ల మ్యాచ్ 25 ఓవర్లకు తగ్గితే, మొదటి నుంచి ఒక్కే బంతిని ఉపయోగించాలి. ఈ మార్పు వల్ల బంతికి వయసు వచ్చే అవకాశం పెరిగి, రివర్స్ స్వింగ్, స్పిన్ వంటి అంశాలు బౌలర్లకు సహకరించనున్నాయి. బ్యాట్స్‌మెన్‌కి అనుకూలంగా మారుతున్న గేమ్‌లో ఇది బ్యాలెన్స్ తీసుకురావడంలో కీలకంగా మారుతుంది. ఈ సిఫార్సు గంగూలీ నేతృత్వంలోని మెన్స్ క్రికెట్ కమిటీ నుంచి వచ్చిందని ICC తెలిపింది.
కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్ రూల్‌లో మార్పు: ఇకపై టాస్‌కు ముందు జట్లు ఐదు కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్‌లను (బ్యాటర్, వికెట్ కీపర్, ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్, ఆల్‌రౌండర్) ముందుగా నామినేట్ చేయాలి. ఒకవేళ ఈ ఆటగాళ్లలో ఎవరు గాయపడితే, మ్యాచ్ రిఫరీ అనుమతితో నేరుగా లైక్-ఫర్-లైక్ ప్లేయర్‌ను బదులుగా తీసుకోవచ్చు. ఇది ఆటలో పారదర్శకత, న్యాయాన్ని కాపాడడమే కాకుండా, ఆటగాళ్ల ఆరోగ్యాన్ని ప్రాధాన్యంలో పెట్టే విధంగా రూపొందించబడింది.
ఈ రెండు కొత్త నిబంధనలు వన్డేలు, టెస్ట్‌లు, టి20 మ్యాచ్‌ల్లో వరుసగా అమల్లోకి రానున్నాయి. వన్డేల్లో జూలై 2 నుంచి శ్రీలంక-బంగ్లాదేశ్ సిరీస్‌తో, టెస్టుల్లో జూన్ 17 నుంచి, టి20ల్లో జూలై 10 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని ICC స్పష్టం చేసింది.
Heart Attack : తిరుమలలో విషాదం.. మెట్లు ఎక్కుతుంటే గుండెపోటుతో యువకుడు మృతి