BWC: ప్రీ క్వార్టర్స్ లో ప్రణయ్, లక్ష్య సేన్
టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత ఆటగాళ్లు హెచ్ ఎస్ ప్రణయ్ , లక్ష్య సేన్ జోరు కొనసాగుతోంది.
- By Naresh Kumar Published Date - 07:24 PM, Wed - 24 August 22

టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత ఆటగాళ్లు హెచ్ ఎస్ ప్రణయ్ , లక్ష్య సేన్ జోరు కొనసాగుతోంది. పతకం ఆశలు రేకెత్తిస్తున్న వీరిద్దరూ ప్రీ క్వార్టర్స్ లో అడుగుపెట్టారు. లక్ష్య సేన్ రెండో రౌండ్‌లో అన్‌సీడెడ్ స్పెయిన్ ప్లేయర్ లూయిస్ ఎన్రిక్‌పై 21-17, 21-10 తేడాతో గెలిచాడు. 36 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. అటు మరి మ్యాచ్ లో ప్రణయ్ సంచలన విజయంతో అదరగొట్టాడు. రెండో రౌండ్ లో ప్రణయ్ 21-17, 21-16 స్కోరుతో రెండో సీడ్ కెంటో మెమొటో పై స్టన్నింగ్ విక్టరీ అందుకున్నాడు. మరోవైపు
స్టార్ ఇండియన్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మాత్రం రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. మెడల్ గెలుస్తాడనుకున్న శ్రీకాంత్ అనూహ్యంగా చైనాకు చెందిన అన్‌సీడెడ్ ప్లేయర్ ఝావో జున్ పెంగ్ చేతిలో 9-21, 17-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. ఝావో పెంగ్ చేతుల్లో శ్రీకాంత్ ఓడిపోవడం ఇది రెండోసారి. 2017 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ అతడు ఓడిపోయాడు. 12 నిమిషాల్లోనే తొలి గేమ్ ఓడిపోయిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో కాస్త పోరాడినా ఫలితం లేకపోయింది.గతేడాది వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన అతడు.. ఈసారి రెండో రౌండ్‌లో ఓడిపోవడం నిరాశ కలిగించింది.