HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >How To Watch India Vs Zimbabwe 2024 T20is For Free

IND vs ZIM : భార‌త్ వ‌ర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్.. ఫ్రీగా మ్యాచుల‌ను చూడొచ్చా..?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త జ‌ట్టు ఇప్పుడు జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది.

  • Author : News Desk Date : 04-07-2024 - 8:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ind Vs Zim
Ind Vs Zim

IND vs ZIM : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త జ‌ట్టు ఇప్పుడు జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆతిథ్య జింబాబ్వేతో 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నుంది. ప్ర‌పంచ‌క‌ప్ ఆడిన సీనియ‌ర్ ప్లేయ‌ర్ల‌కు విశ్రాంతి ఇచ్చారు. ఈక్ర‌మంలో శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని 15 మంది స‌భ్యులు గ‌ల బృందం జింబాబ్వేలోని హ‌రారేకు చేరుకుంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం ముగిసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం హెడ్ కోచ్ ఎంపిక ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో ఎన్‌సీఏ డైరెక్ట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ తాత్కాలిక కోచ్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన అభిషేక్ శ‌ర్మ‌, రియాన్ ప‌రాగ్‌, తుషార్ దేశ్‌పాండే వంటి ఆట‌గాళ్లు తొలిసారి భారత జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు.

ప్ర‌పంచ‌క‌ప్ బృందంలో భాగ‌మైన య‌శ‌స్వి జైస్వాల్‌, సంజూ శాంస‌న్‌, శివ‌మ్ దూబె లు జింబాబ్వేతో సిరీస్‌లో చోటు ద‌క్కించుకున్నారు. అయితే.. ప్ర‌తికూల వాతావ‌ర‌ణంతో వారు భార‌త్ చేరుకునేందుకు ఆల‌స్యం కావ‌డంతో తొలి రెండు టీ20ల‌కు అందుబాటులో ఉండ‌రు. ఈ క్ర‌మంలో తొలి రెండు టీ20ల‌కు వారి స్థానాల్లో సాయి సుద‌ర్శ‌న్, హ‌ర్షిత్ రాణా, జితేశ్ శ‌ర్మ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించారు.

Also Read: Team India : టీ20 ప్రపంచకప్‌తో ఢిల్లీలోకి టీమ్ ఇండియా గ్రాండ్ ఎంట్రీ

జూలై 6 శ‌నివారం నుంచి భార‌త్, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులు అన్నీ కూడా భార‌త కాల‌మానం ప్ర‌కారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి. హ‌రారే స్పోర్ట్స్ క్ల‌బ్ వేదిక‌గానే 5 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మ్యాచులు సోని స్పోర్ట్స్ నెట్‌వ‌ర్క్‌లో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం కానున్నాయి. సోనీ స్పోర్ట్స్ టెన్ 3(హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4(త‌మిళం) /తెలుగు), సోనీ స్పోర్ట్స్ టెన్ 5 ఛానెల్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఓటీటీలో సోనీ లిప్ యాప్‌లో ఈ మ్యాచుల‌ను చూడొచ్చు..

ఫ్రీగా చూడాలంటే..?

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌, టీ20 ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచులు అన్నింటినీ జియో సినిమా, హాట్‌స్టార్‌లో ఫ్రీగా వీక్షించాం. అయితే.. సోనిలిప్ యాప్‌లో జింబాబ్వే సిరీస్ చూడాలంటే స‌బ్‌స్ర్కిప్ష‌న్ తీసుకోవాల్సి ఉంటుంది. టీవీ ఛానెల్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. అయితే.. జియోటీవీ యాప్ ద్వారా మ్యాచుల‌ను ఫ్రీగా చూడొచ్చు. ఈ యాప్‌లో సోనీ టీవీ నెట్‌వ‌ర్క్ ఛానెల్స్‌ను ఓపెన్ చేసి మ్యాచుల‌ను ఫ్రీగా చూడొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IND vs ZIM
  • India Tour Of Zimbabwe
  • Sony Sports Network
  • team india

Related News

Womens T20 World Cup

మహిళల టీ20 వరల్డ్ కప్‌.. ప్రైజ్ మ‌నీ ఎంతంటే?

జూన్ 12 నుండి ప్రారంభం కానున్న మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ 82.64 కోట్ల రూపాయల బహుమతి మొత్తాన్ని ప్రకటించింది.

    Latest News

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

    • చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ మాస్టర్ ప్లాన్!

    • Allu Arjun : ముంబైకి మకాం మార్చబోతున్న అల్లు అర్జున్ ?

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    Trending News

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd