HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Harshal Patel Should Be In 14 15 Crore Category Virender Sehwag

Harshal Patel: అతను 15 కోట్ల ప్లేయర్ – సెహ్వాగ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు.

  • Author : Naresh Kumar Date : 27-05-2022 - 11:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harshal Patel
Harshal Patel

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ఎలిమినేటర్ మ్యాచ్ చివరి ఓవర్ లో లక్నో 22 పరుగుల చేయాల్సిన తరుణంలో హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆర్ సీబీ కి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై ఐదు పరుగులు ఇచ్చిన హర్షల్ పటేల్….ప్రమాదకరమైన స్టోయినిస్ వికెట్ తీశాడు. అతడిపై టీమ్ యాజమాన్యంతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల్ని కురిపిస్తున్నారు. మాజీ ఓపెనర్ సెహ్వాగ్ అయితే హార్శల్ ను ఆకాశానికి ఎత్తేశాడు.

అతడు 14 నుంచి 15 కోట్ల ధర పలకాల్సిన ఆటగాడని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. డెత్ ఓవర్స్ లో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీసే నైపుణ్యం హర్షల్ పటేల్ కు ఉందని సెహ్వాగ్ అన్నాడు. మ్యాచ్ ను మలుపు తిప్పే ప్రతిభా పాఠవాలున్న క్రికెటర్ అని పేర్కొన్నాడు. 15 కోట్ల ధరకు అతడు పూర్తిగా అర్హుడని అభిప్రాయ పడ్డాడు. ఈ సీజన్ లో హర్షల్ పటేల్ 19 వికెట్లు తీశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఫిబ్రవరి లో జరిగిన మెగా వేలంలో హర్షల్ పటేల్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.

2021 ఐపీఎల్ సీజన్ లో హర్షల్ అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్ లో అద్భుతంగా రాణించిన ఈ పేసర్ 15 మ్యాచ్ ల్లో 32 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకూ మొత్తం 77 మ్యాచ్ లలో 97 వికెట్లు పడగొట్టాడు.
ఈ సీజన్ లో బెంగుళూరు సాధించిన పలు విజయాల్లో హర్షల్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే ఇవాళ జరుగనున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ తో టైటిల్ కోసం పోటీ పడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harshal patel
  • IPL 2022
  • royal challengers bangalore
  • virendra sehwag

Related News

Anushka Sharma Dances Energetically with Kohli

Virat Kohli: కోహ్లీతో కలిసి అనుష్క శర్మ జోష్‌ఫుల్‌ డ్యాన్స్‌

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో ఘన విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. వరుసగా రెండో కప్పును తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో సాధించిన ఈ చారిత్రాత్మక విజయం తర్వాత.. పిచ్‌పై ఎంత హంగామా జరిగిందో, అంతకు మించిన అసలైన సెలబ్రేషన్స్ ‘ఆఫ్టర్ పార్టీ’లో ఆవిష్కృతమయ్యాయి. కెప్టెన్ రజత్ పట

  • IPL Title for RCB for the Second Consecutive Time

    IPL 2026: ఆర్సీబీకి వరుసగా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌

Latest News

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

  • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd