Harbhajan Singh: సూర్యకు భారత కెప్టెన్సీ ఇవ్వడంపై హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
కెప్టెన్సీని కోల్పోవడం హార్దిక్‌కు పెద్ద దెబ్బ. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వచ్చి ఒక్కసారిగా ఇదంతా జరగడం అతనికి పెద్ద షాక్. ఇది సరైనది కాదు. సూర్యకుమార్ యాదవ్ అంటే నాకు చాలా గౌరవం.
- By Gopichand Published Date - 02:30 PM, Sat - 5 October 24

Harbhajan Singh: భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపు అంటే అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ టీమ్ ఇండియాను కూడా ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో బీసీసీఐ ఎంతో మంది యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించింది. అంతే కాదు టీ20 జట్టుకు సూర్య కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ ధృవీకరించింది. మరోవైపు టీ20 జట్టు కెప్టెన్సీని హార్దిక్ పాండ్యా నుంచి తప్పించడంపై భారత మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ (Harbhajan Singh) పెద్ద ప్రకటన చేశాడు. భజ్జీ ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.
స్పోర్ట్స్ యారీతో మాట్లాడుతూ హర్భజన్ సింగ్ ఇలా అన్నాడు. “నేను ఆశ్చర్యపోయాను. కొంతవరకు నేను కూడా నిరాశకు గురయ్యాను. అతను టీమిండియా టీ20 జట్టుకు వైస్ కెప్టెన్. రోహిత్ శర్మ కెప్టెన్‌గా లేనప్పుడు వైస్ కెప్టెన్‌ని కెప్టెన్‌గా నియమిస్తారు. కానీ హార్దిక్ విషయంలో ఇది జరగలేదు. అతను ఏడాదికి పైగా జట్టును నడిపించాడు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడం పాండ్యాకు పెద్ద ఎదురుదెబ్బగా అనిపిస్తుంది” అని స్పోర్ట్స్ యారీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ తెలిపారు.
Also Read: KTR Fire: ఈ ముఖ్యమంత్రికి బతుకమ్మ అంటే గిట్టదా.. పట్టదా?: కేటీఆర్
హర్భజన్ ఇంకా మాట్లాడుతూ.. కెప్టెన్సీని కోల్పోవడం హార్దిక్‌కు పెద్ద దెబ్బ. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వచ్చి ఒక్కసారిగా ఇదంతా జరగడం అతనికి పెద్ద షాక్. ఇది సరైనది కాదు. సూర్యకుమార్ యాదవ్ అంటే నాకు చాలా గౌరవం. అతను అద్భుతమైన ఆటగాడు. నిస్వార్థంగా ఆడతాడని చెప్పాడు. బంగ్లాదేశ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల T-20 సిరీస్ కోసం BCCI గత వారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ టీమ్ కమాండ్ సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉంటుంది. మూడు మ్యాచ్‌లు అక్టోబర్ 6 (గ్వాలియర్), 9 అక్టోబర్ (న్యూఢిల్లీ), 12 అక్టోబర్ (హైదరాబాద్)లో జరగనున్నాయి. ఆల్‌రౌండర్లుగా హార్దిక్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే జట్టులోకి వచ్చారు.