HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Gt Vs Srh Pitch Report

Pitch Report: GT vs SRH: పిచ్ రిపోర్ట్

గుజరాత్ టైటాన్స్ ,సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత ప్రతిష్టాత్మకం.

  • By Praveen Aluthuru Published Date - 12:35 PM, Mon - 15 May 23
  • daily-hunt
Pitch Report
Pitch Report

Pitch Report: గుజరాత్ టైటాన్స్ ,సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత ప్రతిష్టాత్మకం. నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ లావెండర్ జెర్సీని ధరించనుంది. క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ జెర్సీ ముఖ్య ఉద్దేశం.

నేడు జరగనున్న ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే ప్లేఆఫ్ కైవసం చేసుకుంటుంది. ఇక సన్‌రైజర్స్ ఓడితే ప్లేఆఫ్ ఆశలను వదులుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌కు ముందు అహ్మదాబాద్‌లో జరగనున్న గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ పిచ్, వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం.

గత సీజన్లో ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ IPL 2023లో ప్లేఆఫ్‌లకు చేరుకోవడానికి కేవలం 1 అడుగు దూరంలో ఉంది. ఈ సీజన్‌లో గుజరాత్‌ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడగా 8 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 మ్యాచ్‌లు ఆడి 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

పిచ్ విషయానికి వస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం పిచ్‌పై బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ఎక్కువగా ఉండనుంది. గత రికార్డులను బట్టి చూస్తే నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటింగ్ కి అనుకూలంగా మారుతుంది. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్లకు ఈ పిచ్ కలిసొస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఈ మైదానంలో 6 మ్యాచ్‌లు జరగ్గా, 12 ఇన్నింగ్స్‌ల్లో 6 ఇన్నింగ్స్‌లు 200 మార్క్‌ను దాటాయి. ఈ మైదానంలో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 165 పరుగులు. వెదర్ విషయానికి వస్తే.. ఈ రోజు అహ్మదాబాద్‌లో వేడి తీవ్రత అధికంగా ఉండనుంది. ఉష్ణోగ్రత 33 నుండి 41 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని వెదర్ రిపోర్ట్ అంచనా వేస్తుంది.

Read More: Cyclone Mocha : 6 మంది మృతి..700 మందికి గాయాలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GT vs SRH
  • IPL 2023
  • Narendra Modi stadium
  • PITCH REPORT
  • special jersey

Related News

    Latest News

    • Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఇక‌పై సులభంగా షాపింగ్‌!

    • Ram Temple: ఇది మీకు తెలుసా? అయోధ్య రామమందిరంలో 45 కిలోల బంగారం వినియోగం!

    • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

    • T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

    • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

    Trending News

      • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

      • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

      • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

      • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

      • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd