GT Beats DC:: గుజరాత్ టైటాన్స్ జోరు… ఢిల్లీ క్యాపిటల్స్ కు మరో ఓటమి
ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. సమిష్టిగా రాణించి వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
- Author : Naresh Kumar
Date : 04-04-2023 - 11:26 IST
Published By : Hashtagu Telugu Desk
GT Beats DC: ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. సమిష్టిగా రాణించి వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఢిల్లీపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు మంచి ఆరంభాన్ని ఇవ్వడంలో ఓపెనర్లు మరోసారి విఫలమయ్యారు. ఓపెనర్ పృథ్వీ షా మరోసారి నిరాశ పరిచాడు. కాసేపటికే మిచెల్ మార్ష్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి వార్నర్ ధాటిగా ఆడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. అయితే
వార్నర్ , రిలీ రోసౌలను వరుస బంతుల్లో ఔట్ చేసిన అల్జారీ జోసెఫ్జ.. ఢిల్లీ క్యాపిటల్స్ ను కోలుకోలేని దెబ్బతీసాడు. ఈ పరిస్థితుల్లో అభిషేక్ పోరెల్ రెండు భారీ సిక్సర్లతో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. స్కోర్ పెంచే క్రమంలో పోరెల్ ఔటవడంతో బౌల్డ్ చేయడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్ సాయంతో జట్టు స్కోర్‌ను 150 పరుగుల మార్క్ ధాటించాడు. అన్రిచ్ నోర్జ్ ఆఖరి బంతికి బౌండరీ బాదడంతో పోరాడే స్కోరును గుజరాత్ ముందు ఉంచగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసింది. షమీ, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించగా… అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ధాటిగా ఆడినప్పటికీ..వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సాహా 14 , గిల్ 14 రన్స్ కే పరిమితం అయ్యారు. పాండ్య కూడా 5 రన్స్ కే ఔటవడంతో గుజరాత్ కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో సాయి సుదర్శన్ చక్కని ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. వచ్చిన అవకాశాన్ని సద్వనియోగం చేసుకుని జట్టును గెలిపించారు. విజయ్ శంకర్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. శంకర్ ఔటైనప్పటికీ…డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరుపించడంతో గుజరాత్ సునాయాసంగా టార్గెట్ అందుకుంది. మిల్లర్ 16 బంతుల్లో 2 ఫోర్లు , 2 సిక్సర్లతో 31 , సాయి సుదర్శన్ 48 బంతుల్లో 4 ఫోర్లు , 2 సిక్సర్లతో 62 రన్స్ తో అజేయంగా నిలిచారు. గుజరాత్ టైటాన్స్ కు ఇది రెండో విజయం. అటు ఢిల్లీ కాపిటల్స్ కు ఇది రెండో ఓటమి.
That winning feeling 🙌@gujarat_titans fans, how happy are you with 2️⃣ wins on the trot 💪#TATAIPL | #GTvDC pic.twitter.com/WxUT2lrOOQ
— IndianPremierLeague (@IPL) April 4, 2023