Ricky Ponting: జైస్వాల్ పై పాంటింగ్ కామెంట్స్.. ఆ ముగ్గురు కూడా
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ చిరస్మరణీయ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యశస్వి తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు
- Author : Praveen Aluthuru
Date : 16-07-2023 - 11:40 IST
Published By : Hashtagu Telugu Desk
Ricky Ponting: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ చిరస్మరణీయ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యశస్వి తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. భారత జట్టులోని ఈ యువ ప్రతిభపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు.
“యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ ఆధారంగా రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయ్యాడు. అతను మంచి యువ ఆటగాడు అని అందరికీ తెలుసు. అదేవిధంగా జైస్వాల్ ఐపీఎల్ లోను అద్భుతంగ రాణించాడని పాంటింగ్ ప్రశంసించాడు. ఇక జైస్వాల్ తో పాటు రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్ మరియు పృథ్వీ షాలపై పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు.
టెస్ట్ మ్యాచ్ కోసం నేను అంతగా ఆసక్తి చూపించలేను కానీ యువ ఆటగాళ్లు టెస్ట్ లో అద్భుతంగ ఆడుతున్నారని చెప్పారు. వారి దేశీయ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి, ఇది నన్ను చాలా ఆకట్టుకుంది అంటూ పేర్కొన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా యశస్విలా రాణించగలడని నా అభిప్రాయం. నా అభిప్రాయం ప్రకారం అతను చాలా మంచి టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ అవుతాడు. దీంతో పాటు రానున్న కొన్నేళ్లలో ప్రతి ఫార్మాట్‌లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తాడని అభిప్రాయపడ్డారు పాంటింగ్. సర్ఫరాజ్ కూడా చాలా ప్రతిభ ఉన్న బ్యాట్స్‌మెన్. కానీ బహుశా అతని పూర్తి సామర్థ్యాన్ని ఇంకా చూడలేదని అన్నారు.