Robin Uthappa : రాబిన్ ఉతప్పకు అరెస్ట్ వారెంట్
కాగా డిసెంబర్ 4న ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అవుతుందన్న విషయం తెలుసుకుని ఉతప్ప తన ఇంటి అడ్రస్(Robin Uthappa) మార్చుకున్నాడు.
- By Naresh Kumar Published Date - 01:34 PM, Sat - 21 December 24

Robin Uthappa : టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్పకు బిగ్ షాక్ తగిలింది. ప్రావిడెంట్ ఫండ్ కేసులో అతనిని అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు పీఎఫ్ రిజినల్ కమీషనర్ గోపాల్ రెడ్డి ఉతప్పను అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులను కోరారు. ఈ మేరకు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు.
Also Read :Arvind Kejriwal Vs ED : లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ విచారణ.. ఈడీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి
ఉతప్ప సెంచరీస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో జీతాల నుంచి పీఎఫ్ సొమ్మును ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయలేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. విశేషమేంటంటే కేవలం 23 లక్షల కోసం ఊతప్ప ఈ మోసానికి పాల్పడ్డాడంటూ ఉద్యోగులు వాపోతున్నారు. కాగా డిసెంబర్ 4న ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అవుతుందన్న విషయం తెలుసుకుని ఉతప్ప తన ఇంటి అడ్రస్(Robin Uthappa) మార్చుకున్నాడు. దీంతో పీఎఫ్ అధికారులు ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేసి గాలిస్తున్నారు.
రాబిన్ ఉతప్ప అంటే మనకు మొదట గుర్తుకొచ్చేది 2007 టి20 ప్రపంచకప్. ఆ టోర్నీలో టీమిండియా ఫైనల్లో పాకిస్థాన్ పై గెలిచి తొలి టి20 వరల్డ్ అందుకుంది. ధోనీ సారధ్యంలో రాబిన్ ఊతప్ప అద్భుత ప్రదర్శనతో హాఫ్ సెంచరీ చేశాడు. ఒకరకంగా ఆ టోర్నీలో ఊతప్ప పాత్ర ఎంతగానో ఉంది. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఉతప్ప తొలి వన్డే ఆడాడు. అలాగే 2014లో ఐపీఎల్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. ఊతప్ప తన కెరీర్లో 46 అంతర్జాతీయ వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా ఊతప్ప జట్టుకు దూరమయ్యాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ కావడం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది