ENG-W vs PAK-W: పాకిస్థాన్ పై సెంచరీ కొట్టిన లెస్బియన్ క్రికెటర్
ఇంగ్లండ్, పాకిస్థాన్ మహిళా క్రికెటర్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా ఈ రోజు మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఈ భారీ స్కోర్ సాధించడంలో వెటరన్ ఆల్ రౌండర్ నేట్ సివర్ బ్రంట్ కీలక పాత్ర పోషించింది.
- Author : Praveen Aluthuru
Date : 30-05-2024 - 12:21 IST
Published By : Hashtagu Telugu Desk
ENG-W vs PAK-W: ఇంగ్లండ్, పాకిస్థాన్ మహిళా క్రికెటర్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా ఈ రోజు మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఈ భారీ స్కోర్ సాధించడంలో వెటరన్ ఆల్ రౌండర్ నేట్ సివర్ బ్రంట్ కీలక పాత్ర పోషించింది. బ్రంట్ అద్భుత సెంచరీతో జట్టు విజయంలో భాగస్వామ్యం అయింది.
మహిళా క్రికెటర్‌ను వివాహం చేసుకున్న మహిళా క్రికెటర్లలో నేట్ సివర్ బ్రంట్ ఒకరు. రెండు సంవత్సరాల క్రితం నేట్ తన సొంత దేశానికి చెందిన కేథరీన్ బ్రంట్‌ను వివాహం చేసుకున్నది. నిన్నటితో వారి వివాహానికి రెండేళ్లు పూర్తయ్యాయి. ఆ మరుసటి రోజు తాను అద్భుత సెంచరీని సాధించి వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకుంది.
Nat Sciver-Brunt at her very best ✨
Match centre ➡️ https://t.co/jjcK0NxBaH#EnglandCricket pic.twitter.com/aX5ZYCVgYj
— England Cricket (@englandcricket) May 29, 2024
ఈ మ్యాచ్‌లో బ్రంట్ 117 బంతుల్లో 124 పరుగులు చేసింది. ఈ బ్యాట్స్‌మన్ తన ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, రెండు సిక్సర్లతో సత్తా చాటింది బ్రంట్ కు వన్డే కెరీర్‌లో ఇది నాల్గవ సెంచరీ. దీంతో మహిళల క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన పరంగా ఆమె మూడవ స్థానంలో నిలిచింది. ఆమె కంటే ముందు న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ 13 సెంచరీలతో రెండో స్థానంలో ఉంది. కాగా, ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ 15 సెంచరీలతో నంబర్ వన్‌గా ఉంది. కాగా ఈ మ్యాచ్ లో డెన్నీ వ్యాట్ నేటి కు సహకారం అందించింది. తాను 42 బంతుల్లో 44 పరుగులు సాదించింది. అమీ జోన్స్ 27 పరుగులు చేసింది. అలిస్సా క్యాప్సీ 39 నాటౌట్‌గా నిలిచింది.
Also Read: Health: మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే.. ఈ తప్పు చేయకండి