HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Disney Star Creates New Viewership Record In High Voltage Match

Disney Star Viewership: దాయాదుల పోరా.. మజాకా.. వ్యూయర్ షిప్ లో హాట్ స్టార్ రికార్డ్..!

భారత్ , పాక్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని ఆశించిన ఫాన్స్ కు నిరాశే మిగిలింది. ఏకపక్షంగా సాగిన పోరులో భారత్ ఘన విజయం సాధించింది. అయితే వ్యూయర్ షిప్ (Disney Star Viewership)లో మాత్రం చిరకాల ప్రత్యర్థుల సమరం సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

  • Author : Naresh Kumar Date : 15-10-2023 - 9:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Semi Final Scenario
Semi Final Scenario

Disney Star Viewership: ప్రపంచ కప్ మొదలై రెండు వారాలు పూర్తయినా ఇప్పటి వరకు నువ్వా నేనా అన్న రీతిలో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. భారత్ , పాక్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని ఆశించిన ఫాన్స్ కు నిరాశే మిగిలింది. ఏకపక్షంగా సాగిన పోరులో భారత్ ఘన విజయం సాధించింది. అయితే వ్యూయర్ షిప్ (Disney Star Viewership)లో మాత్రం చిరకాల ప్రత్యర్థుల సమరం సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. డిస్నీహాట్ స్టార్ క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. హైఓల్టేజ్ మ్యాచ్‌లో రికార్డు రియల్ టైమ్ వ్యూస్‌ను రాబట్టింది. ఈ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగినా గరిష్టంగా 3 కోట్ల 40 లక్షల వ్యూస్ వచ్చాయి.

ముఖ్యంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసే సమయంలో ఈ రికార్డు నమోదు అయ్యింది. ఏ దశలోనూ వ్యూస్ 3 కోట్లకు తగ్గలేదు. వన్డే ప్రపంచకప్ ముందు శ్రీలంక వేదికగా జరిగిన ఆసియాకప్ 2023లో‌నూ భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు గరిష్టంగా 2 కోట్ల 80 లక్షల రియల్ టైమ్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. తాజా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అధిగమించింది.ఈ మ్యాచ్‌కు ముందు 2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు గరిష్టంగా 2 కోట్ల 53 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది కూడా హాట్ స్టార్ రికార్డే.

Also Read: Shanaka Ruled Out: శ్రీలంక జట్టుకు బిగ్ షాక్.. గాయం కారణంగా కీలక ఆటగాడు దూరం..!

We’re now on WhatsApp. Click to Join.

జియో సినిమా దెబ్బకు హాట్ స్టార్ ఆసియాకప్‌తో పాటు ప్రపంచకప్‌ మ్యాచ్‌లను ఫ్రీగా చూసే అవకాశం కల్పించింది. దీంతో వ్యూయర్ షిప్ లో రికార్డు నమోదవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ప్రపంచ కప్ లో భారత్ ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశం ఉంది. పాకిస్థాన్ పై గెలుపుతో హ్యాట్రిక్ విజయం అందుకున్న భారత్ తర్వాతి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Disney star
  • Disney Star Viewership
  • ICC World Cup 2023
  • ind vs pak

Related News

T20 World Cup 2026

టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

ఈ హైబ్రిడ్ మోడల్ అర్థం ఏమిటంటే 2024 నుండి 2027 వరకు జరిగే ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతాయి.

  • T20 World Cup 2028

    టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • BCCI-ICC

    భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

  • Asia Cup Rising

    సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

Latest News

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

  • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

  • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

Trending News

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd