IPL 2022 : ఢిల్లీ, పంజాబ్ తుది జట్లు ఇవే
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ జరుగనున్న ఆసక్తికర సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ , పంజాబ్ కింగ్స్ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.
- By Naresh Kumar Published Date - 05:00 PM, Wed - 20 April 22

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ జరుగనున్న ఆసక్తికర సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ , పంజాబ్ కింగ్స్ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టు ఏడో స్థానంలో ఉండగా.. అలాగే ఈ సీజన్ లో ఆడిన 5 మ్యాచుల్లో 2 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎనిమిదో ప్లేస్ లో ఉంది. అలాగే రెండు జట్ల హెడ్-టు-హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఇరు జట్లు 28 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా పంజాబ్ కింగ్స్ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో కరోనా బారిన పడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో స్థానంలో యువ ఆటగాడు యాష్ ధూల్ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే గత మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన పంజాబ్ కింగ్స్ సారథి మయంగా అగర్వాల్ ఢిల్లీతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఢీకొట్టే ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టులో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, యశ్ ధుల్, రిషబ్ పంత్ , రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్ చోటుదక్కించుకున్నారు. అలాగే ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో పోటీపడే పంజాబ్ కింగ్స్ తుది జట్టులో శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ , జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ , షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్ చోటు దక్కించుకున్నారు.