HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >David Warner Arrest

David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

గతంలో కూడా వార్నర్ పలు క్రమశిక్షణ ఉల్లంఘనలతో వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆయన కెరీర్‌ను ఒక కుదుపు కుదిపేసింది. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఆయన ప్రతిష్టను దెబ్బతీసే అంశం

  • Author : Sudheer Date : 07-04-2026 - 5:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
David Warner Arrest
David Warner Arrest

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. సిడ్నీ నగరంలో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో స్థానిక పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోవడం క్రీడా ప్రపంచంలో సంచలనంగా మారింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, పరిమితికి మించి ఆల్కహాల్ సేవించి కారు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో వార్నర్ దొరికిపోయారు. దీంతో పోలీసులు వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి, విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు.

పిఎస్ఎల్ (PSL) నుంచి విరామం

ప్రస్తుతం డేవిడ్ వార్నర్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో కరాచీ కింగ్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నారు. లీగ్ మధ్యలో వ్యక్తిగత కారణాలతో కొద్దిరోజుల పాటు విరామం తీసుకున్న ఆయన, స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు నమోదు చేసిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుపై వచ్చే నెలలో కోర్టులో విచారణ జరగనుంది. ఈ లోపు వార్నర్ తిరిగి లీగ్‌లో చేరతారా లేదా అనేది ఇప్పుడు సందిగ్ధంలో పడింది.

వార్నర్ కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం

గతంలో కూడా వార్నర్ పలు క్రమశిక్షణ ఉల్లంఘనలతో వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆయన కెరీర్‌ను ఒక కుదుపు కుదిపేసింది. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఆయన ప్రతిష్టను దెబ్బతీసే అంశం. కోర్టు ఇచ్చే తీర్పును బట్టి వార్నర్ లైసెన్స్ రద్దు కావడమే కాకుండా, భారీ జరిమానా కూడా పడే అవకాశం ఉంది. ఈ వార్త తెలియగానే సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • David Warner
  • David Warner Arrested
  • Former Australian Cricketer
  • Karachi Kings Captain
  • Maroubra Police Station
  • Sydney Drunk and Drive Case
  • Warner Drink and Drive

Related News

    Latest News

    • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

    • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

    • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

    • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

    • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd