IPL Effect: రెచ్చిపోయిన ప్రేమికులు.. రికార్డుస్థాయిలో కండోమ్స్, బిర్యానీ ఆర్డర్లు!
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లవర్స్ కు వరంగా మారిందని స్వయంగా ఆన్ లైన్ ఫుడ్ ను డెలివరీ చేసే స్విగ్గీ ఆసక్తికర ట్వీట్ చేసింది.
- Author : Balu J
Date : 30-05-2023 - 4:10 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ 2023 (IPL) సీజన్ సాధారణ ప్రేక్షకులు, క్రికెట్ అభిమానులకే కాకుండా ప్రేమికులకు ఎక్కడా లేని మజాను అందించింది. ఐపీఎల్ కు ప్రేమికులకు ఏ సంబంధం ఉందని ఆశ్చర్యపోతున్నారా..? ఈ సీజన్ ఐపీఎల్ లవర్స్ (Lovers) కు వరంగా మారిందని స్వయంగా ఆన్ లైన్ ఫుడ్ ను డెలివరీ చేసే స్విగ్గీ (Swiggy)నే ఒప్పుకుంది. ఇంతకీ ఏంజరిగిందంటే..
వర్షం కారణంగా మొన్న చెన్నై, గుజరాత్ మ్యాచ్ కు అంతరాయ ఏర్పడి నిలిచిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్ ధోని కోసం చాలామంది అభిమానులు మ్యాచ్ ను చూసేందుకు ఉత్సాహం చూపారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో రోడ్లు, రైల్వే స్టేషన్లలోనే నిద్రపోయారు. అయితే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు చాలా జంటలు (Couples) కూడా వచ్చాయి. అయితే వారంతా ఓయో రూమ్స్, లాడ్జీల్లో రూమ్స్ బుక్ చేసుకున్నారు. వర్షం (Rain) కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ప్రేమికులు కూడా రెండు రోజులుగా లాడ్జీల్లోనే ఉండిపోయారు.
ఈ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ యాప్ Swiggy ట్విట్టర్‌లో ద్వారా ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. ఐపీఎల్ నిలిచిపోవడంతో ప్రేమికులు అత్యధికంగా బిర్యానీలు ఆర్డర్ చేసినట్టు తెలిపింది. అంతేకాదు.. వాటితో పాటు కండోమ్స్ కూడా తెప్పించుకున్నట్టు చెప్పింది. మొత్తానికి ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులకు ఎలాంటి మజాను అందించిందో, అంతకుమించి ప్రేమికులకు అసలైన మజాను అందించింది. దాదాపు 2423 కండోమ్స్ డెలివరీ అయ్యాయంటే ప్రేమికులు ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశారో ఇట్టే తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ కావడంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. నిజంగా ప్రేమికులకు భలే ఛాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో సీఎస్కే జట్టు అన్యూహంగా గెలిచి కోట్లాది అభిమానుల మనసులను గెలుచుకుంది.
2423 condoms have been delivered via @SwiggyInstamart so far, looks like there are more than 22 players playing tonight 👀 @DurexIndia
— Swiggy Food (@Swiggy) May 29, 2023