Manu Bhaker Award: ఖేల్ రత్న అవార్డులపై వివాదం.. జాబితాలో మను భాకర్ పేరు మాయం!
ఇటీవల మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డు కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్ట్ మను భాకర్ పేరు లేకపోవడం వివాదానికి దారితీసింది.
- Author : Gopichand
Date : 24-12-2024 - 1:29 IST
Published By : Hashtagu Telugu Desk
Manu Bhaker Award: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు 2 పతకాలు సాధించిన షూటర్ మను భాకర్ (Manu Bhaker Award) పేరు ఖేల్ రత్న అవార్డును అందుకున్న అథ్లెట్ల జాబితాలో చేర్చలేదు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) లేదా మను భాకర్ స్వయంగా ఈ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని మీడియా కథనం వెల్లడించింది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు భారతదేశంలో ఒక క్రీడా క్రీడాకారుడికి ఇచ్చే అత్యున్నత గౌరవమని మనకు తెలిసిందే.
అయితే ఇటీవల మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డు కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్ట్ మను భాకర్ పేరు లేకపోవడం వివాదానికి దారితీసింది. ఈ విషయం అధికారులు దృష్టికి రాగా వారు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఖేల్ రత్న అవార్డుకు మను దరఖాస్తు చేసుకోలేదని అధికారులు ప్రకటనలో వెల్లడించారు.
Also Read: Onion Price: రైతులను కంటతడి పెట్టిస్తున్న ఉల్లి.. 20% ఎగుమతి సుంకాన్ని తొలగించాలని డిమాండ్!
అయితే అధికారుల ప్రకటనపై మను భాకర్ రామ్ కిషన్ స్పందించారు. అధికారుల ప్రకటన పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి అత్యున్నత పురస్కారం కోసం తాము గతంలోనే దరఖాస్తు చేసుకున్నామని ఆయన వివరించారు. అయితే ఓ నివేదిక ప్రకారం.. భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీ అవార్డు కోసం మను భాకర్ కుటుంబం దరఖాస్తు చేసుకోవాలనుకుందని పేర్కొంది. వివిధ రంగాలలో చేసిన కృషికి పద్మశ్రీ అవార్డును అందజేస్తారు.
ఈ విషయంపై ఎన్‌ఆర్‌ఏఐ ప్రెసిడెంట్ కాళికేష్ నారాయణ్ సింగ్ వివరణ ఇస్తూ.. దరఖాస్తు చేయాల్సిన బాధ్యత అథ్లెట్‌దేనని, అయితే జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో క్రీడా మంత్రిత్వ శాఖను సంప్రదించి మను భాకర్ పేరును చేర్చాలని డిమాండ్ చేశామని తెలిపారు. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, హై-జంప్ పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌ల పేర్లు కూడా ఖేల్ రత్న కోసం సిఫార్సు చేశారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు వేర్వేరు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇది కాకుండా ఒలింపిక్ గేమ్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా కూడా ఆమె నిలిచింది. ఇకపోతే ఆగస్ట్‌లో 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో కాంస్య పతకాలను గెలుచుకున్న మను ఒకే గేమ్‌లలో రెండు పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారిణిగా నిలిచిన విషయం మనకు తెలిసిందే.