INDIA ODI SQUAD SA Series: సఫారీలతో వన్డే సిరీస్ కు కెప్టెన్ గా గబ్బర్ !
సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం జట్టును ప్రకటించనుంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ నేపథ్యంలో స్టార్ ప్లేయర్స్ అందరికీ రెస్ట్ ఇవ్వనున్నారు.
- Author : Anshu
Date : 27-09-2022 - 12:51 IST
Published By : Hashtagu Telugu Desk
INDIA ODI SQUAD SA Series: సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం జట్టును ప్రకటించనుంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ నేపథ్యంలో స్టార్ ప్లేయర్స్ అందరికీ రెస్ట్ ఇవ్వనున్నారు. వరల్డ్ కప్ జట్టులో ఉన్న ఆటగాళ్ళు సౌతాఫ్రికాతో టీ ట్వంటీ సీరీస్ ముగియగానే ఆస్ట్రేలియా బయలుదేరనున్నారు. దీంతో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ కెప్టెన్ గా బాధ్యతలు అందుకోనున్నాడు.
బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ధావన్ కెప్టెన్ గానూ, సంజూ శాంసన్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశముంది. స్వదేశంలో న్యూజిలాండ్-ఏతో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన భారత ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా సిరీస్‌కు సెలక్టర్లు ఎంపికచేయనున్నట్లు సమాచారం. రోహిత్, విరాట్‌తో సహా టీ ట్వంటీ ప్రపంచకప్‌లో ఉన్న ఆటగాళ్లందరికీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతిస్తున్నట్టు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. అలాగే ఈ సీరీస్ కు కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నారు.
వన్డే సిరీస్ కోసం సంజూశాంసన్‌తో పాటు రజత్ పాటిదార్, శుభ్‌మన్‌గిల్‌లకు చోటు కల్పించినట్లు తెలిసింది.ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రజత్ పాటిదార్ 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు . ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ప్లేయర్స్‌లో ఒకడిగా నిలిచాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ ఏ జట్టుతో సీరీస్ లో రాణిస్తున్న కుల్ దీప్ సేన్ కు కూడా చోటు దక్కనుంది. భారత పర్యటనలో సౌతాఫ్రికా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.
దక్షిణాఫ్రికాతో వన్డేలకు భారత జట్టు(అంచనా): శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ప్రసిద్ద్ మాలిక్ , కుల్దీప్ సేన్