TPL : టీపీఎల్‌కు బీసీసీఐ అనుమతి
TPL : ముంబైలో జరిగిన బీసీసీఐ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు
- By Sudheer Published Date - 09:30 PM, Sat - 1 March 25

BCCI approved TPI : తెలంగాణ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రీమియర్ లీగ్ (TPL ) నిర్వహణకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్నీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్షనపల్లి జగన్ మోహన్ రావు (Jagan Mohan Rao) తెలిపారు. ముంబైలో జరిగిన బీసీసీఐ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత వచ్చే జూన్‌లో టీపీఎల్‌ను నిర్వహించేందుకు అనుమతి లభించింది.
TGSRTC : బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్
టీపీఎల్‌తో పాటు తెలంగాణలో క్రికెట్ ప్రాచుర్యాన్ని పెంచే మరో ముఖ్యమైన నిర్ణయం మొయినుద్దౌలా గోల్డ్ కప్ పునరుద్ధరణ. గతంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ టోర్నమెంట్‌ను తిరిగి ప్రారంభించేందుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు బీసీసీఐను కోరగా, దీనికి బోర్డు కూడా అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు బీసీసీఐ పూర్తి సహకారం అందించనుందని హెచ్‌సీఏ అధ్యక్షుడు తెలిపారు.
Borugadda : బోరుగడ్డను పట్టించుకోని వైసీపీ..?
ఈ సమావేశంలో బీసీసీఐ సంయుక్త కార్యదర్శిగా గోవా క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన రోహన్ దేశాయ్ ఎన్నికయ్యారు. ఎన్నికల సందర్భంగా హెచ్‌సీఏ ప్రతినిధిగా పాల్గొన్న జగన్ మోహన్ రావు, రోహన్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు. తెలంగాణలో క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. టీపీఎల్ ద్వారా యువ క్రికెటర్లకు గొప్ప అవకాశాలు లభిస్తాయని, తెలంగాణ క్రికెట్ స్థాయిని పెంచేందుకు ఇది మంచి మద్దతుగా నిలుస్తుందని హెచ్‌సీఏ అభిప్రాయపడింది.