Australian Open 2022 : జకోవిచ్ కు షాక్… వీసా రద్దు
వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. అతని వీసాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆధారాలు చూపించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
- By Hashtag U Published Date - 03:56 PM, Thu - 6 January 22
వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. అతని వీసాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆధారాలు చూపించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ పరిణామంతో జకోవిచ్ 8 గంటల పాటు మెల్ బోర్న్ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు జకోవిచ్ బుధవారం రాత్రి మెల్ బోర్న్ చేరుకున్నాడు. ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం అక్కడికి వెళ్లే వారు ఎవరైనా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకుని ఉండాలి. దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అందజేయాల్సి ఉంటుంది. అయితే టీకా తీసుకునేందుకు మొదట నుండీ నిరారకరిస్తున్న జకోవిచ్ టోర్నీ నిర్వాహకుల ప్రత్యేక అనుమతితో మెల్ బోర్న్ వచ్చాడు. దీనిపై విమర్శలు రావడంతో ఆస్ట్రేలియా ప్రధాని స్పందించారు. నిబంధనలు అందరికీ ఒకటేనని, జకోవిడ్ టీకా తీసుకున్నట్టు సర్టిఫికేట్ చూపించకుంటే స్వదేశానికి తిరిగి పంపించేస్తామని కూడా స్పష్టం చేశారు.
అయితే ఇవేమీ పట్టించుకోని సెర్బియన్ స్టార్ మెల్ బోర్న్ లో అడుగుపెట్టాడు. ఎయిర్ పోర్టులో అధికారులు అతని టీకా సర్టిఫికేట్ లేకపోవడంతో అక్కడే అడ్డుకున్నారు. దీనిపై సెర్బియా అధ్యక్షుడు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినా ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ పరిణామాలతో షాక్ తిన్న జకోవిచ్ కోర్టును ఆశ్రయించాడు, ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం సోమమవారం తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అప్పటి వరకూ జకోవిచ్ ఆస్ట్రేలియాలో ఉండేందుకు అనుమతించింది. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు మాత్రం దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదు. ప్రభుత్వంతో సంప్రదించకుండా నిర్వాహకులు జకోవిచ్ కు ఎలా అనుమతిచ్చారనే దానిపై అక్కడి అధికారులు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మొత్తం మీద జకోవిచ్ టీకా తీసుకోకుండా ఆస్ట్రేలియా వెళ్ళడం పెద్ద వివాదానికే దారి తీసింది.
Tags
Related News
Djokovic – Sania : సానియాతో కలిసి పనిచేస్తా.. అదే నా లక్ష్యం : జకోవిచ్
Djokovic - Sania : ‘ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024’లో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.