Ashwin Shocking Comments: టీమిండియాపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ తో కలిసి మీడియా సమావేశంలో కూర్చుని తన క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికాడు. అయితే అశ్విన్ తాజాగా చేసిన కామెంట్స్ కూడా రోహిత్ ని ఉద్దేశించి చేసినవేనని అర్ధమవుతుంది.
- By Naresh Kumar Published Date - 09:28 AM, Tue - 31 December 24
Ashwin Shocking Comments: మెల్‌బోర్న్ టెస్ట్ ఓటమితో టీమిండియాకు డబ్ల్యూటీసి ఫైనల్ కష్టాలు పెరిగాయి. వాస్తవానికి టీమిండియాకు అర్హత లేదనే చెప్పాలి. డబ్ల్యూటీసి ఫైనల్ ఆడాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో భారత్ పూర్తిగా చేతులెత్తేసింది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బ్యాటర్ల విఫలం కారణంగానే భారత్ కీలక మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఈ ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో రవిచంద్రన్ అశ్విన్ (Ashwin Shocking Comments) రోహిత్ ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ తో కలిసి మీడియా సమావేశంలో కూర్చుని తన క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికాడు. అయితే అశ్విన్ తాజాగా చేసిన కామెంట్స్ కూడా రోహిత్ ని ఉద్దేశించి చేసినవేనని అర్ధమవుతుంది. నిజానికి అశ్విన్ ఉదయం 10 గంటలకు తొలి ట్వీట్ చేసాడు. పోరాట సమయాల్లోనే మంచి నాయకులు ఉద్భవిస్తారు అంటూ అశ్విన్ ట్వీట్ పెట్టాడు. ఈ పోస్ట్ చేసిన 2 నిమిషాల తర్వాత అశ్విన్ ఆ పోస్ట్‌కు జోడిస్తూ ట్విట్టర్‌లో మరో పోస్ట్ చేశాడు. అందులో ఈ ట్వీట్ ఫ్యాన్ క్లబ్‌లు ఉన్నవారికి కాదు అని రాశాడు. అశ్విన్ చేసిన ఈ 2 పోస్ట్‌ల తర్వాత అభిమానులు వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మను అశ్విన్ లక్ష్యంగా చేసుకున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి అశ్విన్ చెప్పాల్సిన విషయం చెప్పకుండా ఇలా ఇండైరెక్ట్ కామెంట్స్ కి అర్ధం ఏమిటో ఆయనే చెప్పాలి.
Also Read: Astrology : ఈ రాశివారు ఈ రోజు తెలివైన నిర్ణయాలతో విజయాన్ని సాధిస్తారు
మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా 340 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించగా, భారత జట్టు 155 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో ప్రస్తుత టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-1తో వెనుకబడింది. ఇప్పుడు సిరీస్‌లోని తదుపరి మ్యాచ్ జనవరి 3 నుంచి సిడ్నీలో జరగనుంది.