Virat Kohli Second Child: మరోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ.. గుడ్ న్యూస్ రివీల్ చేసిన డివిలియర్స్..!
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు రెండో బిడ్డ (Virat Kohli Second Child)కు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని విరాట్ బెస్ట్ ఫ్రెండ్ ఏబీ డివిలియర్స్ చెప్పాడు.
- Author : Gopichand
Date : 04-02-2024 - 8:29 IST
Published By : Hashtagu Telugu Desk
Virat Kohli Second Child: ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల నుంచి విరాట్ కోహ్లీ తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు జరగనుండగా.. అందులో ఆడతాడా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే విరాట్ ఆడకపోవడానికి గల కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కోహ్లీ తల్లి అనారోగ్యం గురించి వార్తలు వచ్చాయి. కాకుంటే ఆ వార్తలను సోదరుడు వికాస్ కోహ్లీ తిరస్కరించాడు. అయితే తాజాగా వచ్చిన సమాచారం మాత్రం చాలా ప్రత్యేకమైనది. దీని ప్రకారం.. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు రెండో బిడ్డ (Virat Kohli Second Child)కు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని విరాట్ బెస్ట్ ఫ్రెండ్ ఏబీ డివిలియర్స్ చెప్పాడు.
ABD ఏం చెప్పాడంటే..?
నిజానికి శనివారం రోజున ఏబీ డివిలియర్స్ భారత్- ఇంగ్లండ్ టెస్ట్ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా పలువురు అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఇంతలో ఓ అభిమాని విరాట్ కోహ్లీ గురించి అడిగాడు. దీనిపై ఏబీడీ మాట్లాడుతూ.. తాను విరాట్‌కు ఫోన్ చేసి అతని యోగక్షేమాలు అడిగానని తెలిపాడు. ఆ తర్వాత విరాట్ తన కుటుంబంతో కలిసి ఉన్నానని చెప్పాడు. విరాట్ కోహ్లీకి రెండో బిడ్డ రాబోతున్నాడని డివిలియర్స్ చెప్పాడు. ఈ కారణంగా అతను కుటుంబంతో ఉన్నాడు. ఈ సమాచారం తెలియగానే ఒక్కసారిగా అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఊహాగానాలు వచ్చిన విషయం మనకు తెలిసిందే.
Also Read: 46 Dead : అగ్నివిలయానికి 46 మంది బలి.. కాలి బూడిదైన 1100 ఇళ్లు
2021లో తొలిసారి తండ్రి అయ్యాడు
విరాట్ కోహ్లీ 2021లో తొలిసారి తండ్రి అయ్యాడు. అనుష్క శర్మకు ఆడపిల్ల పుట్టింది. పాప పేరు విరుష్క. సోషల్ మీడియాలో విరుష్క ఫోటోల గురించి తరచుగా ప్రచారం జరుగుతుంది. అయితే విరాట్ రెండోసారి తండ్రి కాబోతున్నాడనే సమాచారం ఏబీ డివిలియర్స్ నుంచి అందింది. విరాట్ లేదా అనుష్క కుటుంబం లేదా ఇద్దరూ ఆమోదించినప్పుడే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ధృవీకరించబడుతుంది.
We’re now on WhatsApp : Click to Join
అయితే టెస్టు సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ తన పేరును ఉపసంహరించుకోవడంతో బీసీసీఐ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ రిలీజ్‌లో విరాట్ ప్రైవసీని మెయింటెయిన్ చేయమని కోరింది. ఏబీ డివిలియర్స్, విరాట్‌ల మధ్య ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే. అయితే ఏది నిజం అనేది రానున్న రోజుల్లో తేలనుంది.