BCCI Selection Panel: ఛీప్ సెలక్టర్ రేసులో నిలిచేదెవరు..?
పలు మెగా టోర్నీల్లో టీమిండియా వైఫల్యం చెందడంతో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై వేటు పడిన విషయం తెలిసిందే.
- By Gopichand Published Date - 02:01 PM, Sun - 20 November 22
పలు మెగా టోర్నీల్లో టీమిండియా వైఫల్యం చెందడంతో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై వేటు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సెలెక్షన్ కమిటీ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది BCCI. కొత్త కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, మాజీ పేసర్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం సాయంత్రం సీనియర్ సెలక్షన్ కమిటీని తొలగించి బీసీసీఐ అందరినీ ఆశ్చర్యపరిచింది. టీ20 ప్రపంచకప్ 2022లో టీమ్ ఇండియా ఓటమి తర్వాత అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో బోర్డు ఈ చర్య తీసుకుంది. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై రకరకాల ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు మొత్తం కమిటీని తొలగించారు. తదుపరి చీఫ్ సెలెక్టర్ ఎవరు అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. నివేదికల ప్రకారం.. కొత్త చీఫ్ సెలెక్టర్ రేసులో టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ అజిత్ అగార్కర్ ముందంజలో ఉన్నాడు. అజిత్ అగార్కర్ ఇంతకుముందు కూడా ఈ స్థానానికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతను గత సారి రేసులో వెనుకబడ్డాడు. కానీ ఈసారి పరిస్థితి వేరేలా ఉండటంతో అతనికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.
ఓ నివేదిక ప్రకారం.. అజిత్ అగార్కర్‌తో దీని గురించి ఇంకా ఎటువంటి చర్చ జరగలేదని బిసిసిఐ అధికారి ఒకరు చెప్పారు. కానీ అతను ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే అది పూర్తిగా అతని ఎంపిక. చివరిసారి చాలా దగ్గరికి వచ్చినా ఉద్యోగం రాలేదు. అగార్కర్ కు ఐపిఎల్‌తో సహా మూడు ఫార్మాట్లలో అనుభవం ఉందని ఆ అధికారి పేర్కొన్నారు. అజిత్ అగార్కర్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. చీఫ్ సెలెక్టర్ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే అతను ఈ ఐపీఎల్ ఉద్యోగాన్ని వదిలివేయవలసి ఉంటుంది. అయితే బీసీసీఐ నిబంధనలను పరిశీలిస్తే అజిత్ అగార్కర్ ఈ ఉద్యోగానికి సరిగ్గా సరిపోతాడు.
చీఫ్ సెలెక్టర్ కావడానికి ఆర్హతలు:
• 7 లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడై ఉండాలి.
• 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.
• 10 ODIలు లేదా 20 లిస్ట్-A మ్యాచ్‌లు ఆడి ఉండాలి.
• 5 సంవత్సరాల ముందు క్రికెట్ నుండి రిటైర్ అయి ఉండాలి.
• BCCIఏ కమిటీలోనూ సభ్యునిగా ఉండకూడదు.
అజిత్ అగార్కర్ కెరీర్:
• 26 టెస్టులు, 58 వికెట్లు
• 191 ODIలు, 288 వికెట్లు
• 4 T20, 3 వికెట్లు
• 32 IPL మ్యాచ్‌లు, 29 వికెట్లు
Tags
Related News
Iyer- Kishan: అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మరో అవకాశం ఇచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మరోసారి అవకాశం కల్పించింది.