Messi Shirts Auction: మెస్సీ 6 జెర్సీలకు 65 కోట్లు.. రికార్డే ఇది..!
గ్రేట్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీకి (Messi Shirts Auction) సంబంధించిన వస్తువులు కూడా కోట్ల రూపాయలకు వేలంపాటైంది. ఫిఫా ప్రపంచకప్ 2022 మ్యాచ్‌ల సందర్భంగా లియోనెల్ మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను గురువారం న్యూయార్క్‌లో వేలం వేశారు.
- By Gopichand Published Date - 07:56 AM, Sat - 16 December 23

Messi Shirts Auction: క్రీడా ప్రపంచంలో ప్రతిరోజూ ఆటగాళ్లకు సంబంధించిన వస్తువులను వేలం వేయడం వింటూనే ఉంటాం. క్రీడాకారులకు సంబంధించిన వస్తువు కోసం ప్రజలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. కాగా గ్రేట్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీకి (Messi Shirts Auction) సంబంధించిన వస్తువులు కూడా కోట్ల రూపాయలకు వేలంపాటైంది. ఫిఫా ప్రపంచకప్ 2022 మ్యాచ్‌ల సందర్భంగా లియోనెల్ మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను గురువారం న్యూయార్క్‌లో వేలం వేశారు. ఈ మెస్సీ జెర్సీ 7.8 మిలియన్ డాలర్ల భారీ ధరకు విక్రయించబడింది.
ఈ మెస్సీ జెర్సీల వేలం ఈ సంవత్సరం అత్యంత విలువైన క్రీడా వేలంగా మారింది. గతేడాది ఖతార్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ధరించిన ఆరు జెర్సీలు వేలానికి వచ్చాయి. ఈ జెర్సీలన్నీ వేలంలో 78 లక్షల డాలర్లకు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని వేలం సంస్థ సోథెబీస్ ప్రకటించింది. 2022లో ఖతార్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ తొలి లెగ్ మ్యాచ్‌లలో మెస్సీ ఈ షర్టులను ధరించాడని సోథెబీస్ తెలిపింది. ఈ ఏడాది క్రీడలకు సంబంధించిన వస్తువుల వేలంలో ఇవి అత్యధిక ధరకు అమ్ముడుపోయాయి. 78 లక్షల డాలర్లను భారత రూపాయల్లోకి మార్చితే దాదాపు రూ.64 కోట్లు. అంటే అతని ఒక జెర్సీ ధర దాదాపు రూ.10.5 కోట్లు ఉంటుందని అంచనా.
Also Read: Rs 500 Gas Cylinder : జనవరి మొదటివారంలో రూ.500 గ్యాస్ సిలిండర్ స్కీమ్ ?!
ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షూటౌట్‌లో ఓడించి అర్జెంటీనా మూడో టైటిల్‌ను గెలుచుకుంది. చివరి మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఇరు జట్లు 3-3తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్‌ను ఆశ్రయించారు. ఈ మెస్సీ షర్టుల కోసం గెలిచిన బిడ్డర్ల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
We’re now on WhatsApp. Click to Join.