Rishika Sarkar: నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన చిన్నారి
చిన్న వయసులోనే భవిష్యత్తు భారత మహిళా క్రికెటర్ గా కితాబు అందుకున్న రిషికా సర్కార్. తన అద్భుతమైన బ్యాటింగ్‌కి ఫిదా అయిన యువరాజ్ సింగ్ తన సంతకం చేసిన బ్యాట్‌ను ఆమెకు బహుమతిగా పంపాడు. అంతే కాదు మెర్లిన్ గ్రూప్ రిషికకు స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
- Author : Praveen Aluthuru
Date : 14-07-2024 - 9:04 IST
Published By : Hashtagu Telugu Desk
Rishika Sarkar: ఆమె వయసు నాలుగేళ్లు మాత్రమే. బ్యాట్ కంటే కొంచెం పొడుగ్గా ఉండొచ్చు కానీ.. బ్యాట్ ఊపితే క్రికెట్ లెజెండ్స్ సైతం సైతం ఆశ్చర్యపోతారు. చిన్న వయసులోనే భవిష్యత్తు భారత మహిళా క్రికెటర్ గా కితాబు అందుకున్న ఈ వండర్ బేబీ రిషికా సర్కార్(Rishika Sarkar) గురించి చెప్పుకోవాల్సింది చాలానే ఉంది.
తన అద్భుతమైన బ్యాటింగ్‌కి ఫిదా అయిన యువరాజ్ సింగ్( Yuvraj Singh) తన సంతకం చేసిన బ్యాట్‌ను ఆమెకు బహుమతిగా పంపాడు. అంతే కాదు మెర్లిన్ గ్రూప్ రిషికకు స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కోల్‌కతా(Kolkata)లోని యువరాజ్ సింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆమెకు ఉచిత శిక్షణను ఏర్పాటు చేసింది. రిషిక తండ్రి రాజీవ్ సర్కార్ మాట్లాడుతూ నేను క్రికెటర్‌ని అయ్యి దేశం కోసం ఆడాలని అనుకున్నాను కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా నా కలను నెరవేర్చుకోలేకపోయాను. కొడుకు అయినా, కూతురైనా సరే, నా బిడ్డను క్రికెటర్‌ని చేయాలని నిర్ణయించుకున్నాను. నా కూతురికి నడవగలిగే వయసు వచ్చినప్పుడు నేను ఆమెకు క్రికెట్ నేర్పించడం మొదలుపెట్టాను. ఈ జర్నీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు రాజీవ్.
క్రికెట్ అంటే మగవాళ్ళు ఆడేది అని బంధువులు హేళన చేశారని. మహిళా క్రికెటర్లను ఎవరూ గుర్తించడం లేదు. నీ కూతురికి క్రికెట్ నేర్పించి ఏం చేస్తావు అని ఏవేవో విమర్శలు చేసేవారు. అయితే తన కూతుర్ని గొప్ప క్రికెటర్ని చేయడానికి తన జీవితాన్ని అయినా త్యాగం చేస్తానని చెప్పాడు రాజీవ్. ఎప్పటికైనా తన కుమార్తె భారత మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహించి దేశం కోసం ప్రపంచకప్ సాధించాలనేది నా కల అని అన్నాడు.
Also Read: Team India Future: గంభీర్ వచ్చాడు..టీమిండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది?