World Cup 2023 : కివీస్ హ్యాట్రిక్ విక్టరీ…బంగ్లాదేశ్ పై ఘనవిజయం
టైటిల్ ఫేవరెట్ లో ఒకటైన కివీస్ తాజాగా హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది
- By Sudheer Published Date - 11:16 PM, Fri - 13 October 23
వన్డే ప్రపంచకప్ (World Cup 2023) లో న్యూజిలాండ్ (New Zealand) దుమ్మురేపుతోంది. టైటిల్ ఫేవరెట్ లో ఒకటైన కివీస్ తాజాగా హ్యాట్రిక్ విక్టరీ (Hat-Trick victory) కొట్టింది. బంగ్లాదేశ్ (Bangladesh) పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. లిట్టన్ దాస్ డకౌటవగా.. తర్వాత బ్యాటర్లు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఈ దశలో కెప్టెన్ షకీబుల్ హసన్ (Shakib Al Hasan), వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) ఆదుకున్నారు. వీరిద్దరూ కివీస్ బౌలింగ్ ను ఆచితూచి ఆడుతూ ఐదో వికెట్ కు 96 పరుగులు జోడించారు. షకీబుల్ హసన్ 40 , ముష్ఫికర్ రహీమ్ 66 పరుగులకు ఔటయ్యారు. చివర్లో 41 పరుగులు చేయడంతో బంగ్లా స్కోర్ 200 దాటగలిగింది. కివీస్ బౌలర్లు ఎప్పటికప్పుడు బంగ్లాను కట్టడి చేశారు. ఫలితంగా బంగ్లాదేశ్ 245 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో ఫెర్గ్యుసన్ 3 , బౌల్ట్ 2 , హెన్రీ 2 వికెట్లు పడగొట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆరంభంలోనే రచిన్ రవీంద్ర (Rachin Ravindra) వికెట్ కోల్పోయింది. అయితే కెప్టెన్ విలియమ్సన్ , డెవాన్ కాన్వే రాణించారు. రెండో వికెట్ కు 80 పరుగులు జోడించారు. కాన్వే 45 రన్స్ కు ఔటవగా.. విలియమ్సన్ హాఫ్ సెంచరీ సాధించాడు. సెంచరీ దిశగా సాగుతున్న విలియమ్సన్ అనూహ్యంగా గాయపడ్డాడు. బంగ్లా ఫీల్డర్ విసిరిన త్రో అతని చేతికి బలంగా తాకడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. విలియమ్సన్ 8 ఫోర్లు,1 సిక్సర్ తో 78 రన్స్ చేశాడు. తర్వాత మిఛెల్ , గ్లెన్ ఫిలిప్స్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. కివీస్ 42.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. మిఛెల్ 89 , ఫిలిప్స్ 16 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. న్యూజిలాండ్ ఇది వరుసగా మూడో విజయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు 6 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. అటు బంగ్లాకు ఇది రెండో ఓటమి.
Read Also : KTR Response On Chandrababu Health : చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి తెలిసి బాధనిపిస్తుంది – కేటీఆర్
Related News
Tim Southee: కెప్టెన్సీ నుంచి తప్పుకుంటారా..? సమాధానమిచ్చిన టిమ్ సౌథీ..!
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టిమ్ సౌథీ (Tim Southee) నేతృత్వంలోని కివీస్ జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.