KTR Response On Chandrababu Health : చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి తెలిసి బాధనిపిస్తుంది – కేటీఆర్
చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేశ్ చేసిన ట్వీట్ బాధ కలిగించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నాకూ ఆందోళన కలిగింది
- Author : Sudheer
Date : 13-10-2023 - 11:07 IST
Published By : Hashtagu Telugu Desk
స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)లో ఆరోపణలు ఎదురుకుంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు (Chandrababu Health) ఆరోగ్య పరిస్థితి ఫై బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేశ్ చేసిన ట్వీట్ బాధ కలిగించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నాకూ ఆందోళన కలిగింది.
చంద్రబాబుకు భౌతికంగా థ్రెట్ ఉందని లోకేష్ ట్వీట్ (Nara Lokesh tweet) చేశారన్నారు. అదే నిజమైతే చాలా దురదృష్టకరమన్నారు కేటీఆర్. ఇది ఏపీలోని రెండు పార్టీల వ్యవహరమన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. హైదరాబాద్ శాంతియుతంగా ఉండాలన్నదే తన తపన అని కేటీఆర్ అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుమారుడు , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆందోళన వ్యక్తం చేస్తూ శుక్రవారం ఉదయం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ డాక్టర్స్, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే జగన్‌దే బాధ్యత. చంద్రబాబు ప్రాణాల పట్ల దురుద్దేశంతో కుట్రలు పన్నారు. తగినంత భద్రత లేక చంద్రబాబు ఎంతో ప్రమాదంలో ఉన్నారు. జైలులో చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దోమలు, కలుషిత నీటితో ఇబ్బంది పడుతున్నారు. ఇన్‌ఫెక్షన్, అలర్జీతో బాధపడుతున్నారు’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
Read Also : TDP : తెలంగాణలో టీడీపీ రాజకీయ వ్యూహం అదేనా?