SA vs PAK, 2nd Test: 18 ఏళ్ల యువకుడిని బరిలోకి దించిన సౌతాఫ్రికా
దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిక్యంలో ఉంది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఎలా పునరాగమనం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
- By Naresh Kumar Published Date - 11:49 PM, Fri - 3 January 25

SA vs PAK, 2nd Test: పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రెండవ టెస్ట్ (SA vs PAK, 2nd Test) కేప్ టౌన్‌లో ప్రారంభమైంది. గతంలో ఆఫ్రికా జట్టు పాకిస్థాన్‌ను 2 వికెట్ల తేడాతో ఓడించగా, ఇప్పుడు ఈ మ్యాచ్‌లో కూడా ఆతిథ్య జట్టు పూర్తి సన్నద్ధమై పాకిస్థాన్ కోసం యువకుడిని బరిలోకి దించింది.
పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో క్వేనా మఫాకా అరంగేట్రం చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అతను లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్. మఫాకా 18 ఏళ్ల 270 రోజుల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేసి పాల్ ఆడమ్స్ 25 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. క్వేనా మఫాకా దక్షిణాఫ్రికా తరఫున వన్డే మరియు టీ-20 ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. గత ఏడాది అతను టి20లో అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత అదే సిరీస్‌లో పాకిస్తాన్‌తో తన వన్డే ఫార్మేట్ మొదలు పెట్టాడు. మఫాకా తన కెరీర్లో ఇప్పటివరకు 2 వన్డేలు, 5 టి20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 5 మరియు 3 వికెట్లు పడగొట్టాడు.
Kwena Maphaka, Test Cap number 1️⃣3️⃣4️⃣
The youngest in the history of South African cricket, the left-arm quick has his Test cap presented to him by Piet Botha. 🏏🇿🇦🚀#WozaNawe #BePartOfIt #SAvPAK pic.twitter.com/7PMUey1IpM
— Proteas Men (@ProteasMenCSA) January 3, 2025
దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న ప్లేయర్లు
- 18 సంవత్సరాల 270 రోజుల వయసులో క్వేనా మఫాకా పాక్ పై కేప్ టౌన్ వేదికగా (2025)
- 18 సంవత్సరాల 340 రోజుల వయసులో పాల్ ఆడమ్స్ ఇంగ్లాడ్ పై గెకెబర్హా వేదికగా (1995)
- 19 సంవత్సరాల, 1 రోజు వయసులో ఆర్థర్ ఓచ్సే ఇంగ్లాండ్ పై గెకెబెర్హా వేదికగా (1889)
- 19 సంవత్సరాల, 28 రోజుల వయసులో డాంటే పార్కిన్ ఇంగ్లాండ్ పై కేప్ టౌన్ వేదికగా (1892)
- 19 సంవత్సరాల 48 రోజుల వయసులో విలియం షెల్డర్స్ ఇంగ్లాండ్ పై కేప్ టౌన్ వేదికగా (1899)
తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది
దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిక్యంలో ఉంది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఎలా పునరాగమనం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.