KKR vs RR: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన చాహల్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా యుజ్వేంద్ర చాహల్ రికార్డుల్లోకి ఎక్కాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్
- By Praveen Aluthuru Published Date - 09:14 PM, Thu - 11 May 23
KKR vs RR: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా యుజ్వేంద్ర చాహల్ రికార్డుల్లోకి ఎక్కాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2023 56వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కెప్టెన్ నితీష్ రాణా వికెట్ తీసి ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. దీంతో సీఎస్కే వెటరన్ డ్వేన్ బ్రావో రికార్డును బద్దలు కొట్టాడు.
ఐపీఎల్ చరిత్రలో యుజ్వేంద్ర చాహల్ 2013 నుండి మొత్తం 143 మ్యాచ్‌లు ఆడుతూ 184 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 11వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చిన యుజ్వేంద్ర చాహల్ రెండో బంతికే కెప్టెన్ నితీష్ రాణాను అవుట్ చేసాడు. షిమ్రాన్ హెట్మెయర్ క్యాచ్‌తో నితీష్‌ను అవుట్ చేశాడు. రానా 17 బంతుల్లో 22 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ వికెట్‌తో చాహల్ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు:
యుజ్వేంద్ర చాహల్ – 184 వికెట్లు
డ్వేన్ బ్రావో – 183 వికెట్లు
పీయూష్ చావ్లా – 174 వికెట్లు
అమిత్ మిశ్రా – 172 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్ – 171 వికెట్లు.
Read More: IPL 2023: పాపం జడ్డూ భాయ్ కి ఎంత కష్టమో.. ధోని ఫాన్స్ టూమచ్
Related News
Virat Kohli Milestones: సెంచరీ మాత్రమే మిస్ అయ్యింది.. రికార్డులు కాదు..!
విరాట్‌కు ఈ సీజన్లో రెండో సెంచరీ చేసే అవకాశం ఉంది కానీ 18వ ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ చేతిలో క్యాచ్ ఔట్ అయ్యాడు.