YSRTP:షర్మిల సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో అప్పుడు ఏదయినా జరగవచ్చని నర్మగర్భంగా జగన్ ను టార్గెట్ చేసి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసింది.
- By Hashtag U Published Date - 09:37 PM, Fri - 7 January 22

రాజకీయాల్లో అప్పుడు ఏదయినా జరగవచ్చని నర్మగర్భంగా జగన్ ను టార్గెట్ చేసి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఎక్కడ పెట్టినా తెలంగాణతో బతుకు ముడిపడి ఉందని, వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇక్కడి ప్రజలకోసం పని చేస్తుందని తెలిపారు. అధికారంలో ఉన్నవాళ్లు దిగిపోక తప్పదనే విషయం గుర్తించుకోవాలని పరోక్షంగా జగన్ మీద సెటైర్ వేసింది. పార్టీ ఎక్కడైనా పెట్టవచ్చు అంటూ నర్మగర్భంగా ఏపీకి పార్టీ విస్తరించేలా మాట్లాడారు. ఫలితంగా మరోసారి జగన్ , షర్మిల మధ్య ఉన్న గ్యాప్ అంశం తెరమీదకు వస్తుంది. షర్మిల మాటల్లోనే ఆంతర్యం సంచలనం కలిగిస్తుంది.