YS Jagan: పారిస్ టూర్ కు సీఎం జగన్!
ఏపీ సీఎం జగన్ పారిస్ పర్యటన ఖరారైందని ముఖ్యమంత్రి అధికారులు తెలిపారు.
- By Balu J Published Date - 05:53 PM, Wed - 22 June 22

ఏపీ సీఎం జగన్ పారిస్ పర్యటన ఖరారైందని ముఖ్యమంత్రి అధికారులు తెలిపారు. ఈ నెల 28న రాత్రి బయలుదేరి 29న పారిస్ చేరుకుంటారని తెలిపారు. ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంబిఎ) పూర్తి చేసిన తన పెద్ద కుమార్తె హర్షారెడ్డి గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ముఖ్యమంత్రి హాజరవుతారని వెల్లడించారు. ముఖ్యమంత్రి జూలై 2న తిరిగి వస్తారని పేర్కొన్నారు. అయితే, తనను ప్యారిస్ వెళ్లేందుకు అనుమతించాలని 10 రోజుల క్రితం జగన్ సీబీఐ కోర్టును అభ్యర్థించగా, ఆ అభ్యర్థనను తిరస్కరించాలని సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేయగా, జగన్ ప్యారిస్ వెళితే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని సీబీఐ పేర్కొంది. అయితే కోర్టు నుంచి అనుమతి రాకముందే పర్యటన ఖరారు కావడంతో జగన్ టూర్ కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.