YS Jagan: ’బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా‘తో ఉపాధి అవకాశాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్‌ను ప్రారంభించారు.
- By Balu J Published Date - 02:06 PM, Thu - 21 April 22

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం జలభద్రపురం గ్రామంలో ఏర్పాటు చేసిన బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్‌ను ప్రారంభించారు. ఆదిత్య బిర్లా గ్రూపు రూ.2,700 కోట్ల భారీ పెట్టుబడితో కాస్టిక్ సోడా ప్లాంట్ ఏర్పాటు చేసింది. ప్లాంట్ ఏర్పాటు ద్వారా స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పనకు గ్రాసిమ్ పరిశ్రమ ఇప్పటికే అంగీకారం తెలిపింది. భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా ఆధునిక సాంకేతికతతో పరిశ్రమను ఏర్పాటు చేశారు.