Chalovijayawada: చేతులెత్తేసిన పోలీసులు.. సీయం జగన్ సీరియస్..?
- Author : HashtagU Desk
Date : 03-02-2022 - 1:25 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. అసలు మ్యాటర్ ఏంటంటే.. చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం నలుమూల నుండి ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు భారీ ర్యాలీగా విజయవాడకు తరలి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఉద్యోగుల్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమవడం వెనుక పోలీసుల వైఫల్యమే కారణమని సీయం జగన్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. దాదాపు రెండు వారాల క్రితమే ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు మాత్రం అస్సలు పట్టించుకోలేదని, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, పోలీసు ఉన్నతాధికారుల పనితీరుపై జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అసలు రాష్ట్ర ఇంటలిజెన్స్ ఏమైందనేది చర్చనీయాశం అయ్యింది.
ఊహించని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బల ప్రదర్శన చేయడాన్ని, సీయం జగన్ పోలీసు వైఫల్యంగానే పరిగణించారని చెబుతున్నారు. దీంతో ఈ వైఫల్యానికి బాధ్యులను గుర్తించాలని, ఇంటలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని జగన్ ప్రశ్నించినట్లు సమాచారం. మరి పోలీసు అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.