YouTuber Died: పాపులర్ యూట్యూబర్ యాంగ్రీ రాంట్‌మాన్ మృతి
యాంగ్రీ రాంట్‌మన్‌గా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ అబ్రదీప్ సాహా అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. అబ్రదీప్ సాహా గత కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపపడుతున్నాడు. గత నెలలో శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి ఫలితం లేకుండాపోయింది.
- Author : Praveen Aluthuru
Date : 17-04-2024 - 9:23 IST
Published By : Hashtagu Telugu Desk
YouTuber Died; యాంగ్రీ రాంట్‌మన్‌గా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ అబ్రదీప్ సాహా అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. అబ్రదీప్ సాహా గత కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపపడుతున్నాడు. గత నెలలో శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి ఫలితం లేకుండాపోయింది.అతని మరణానికి ఖచ్చితమైన కారణం అధికారికంగా బహిర్గతం చేయనప్పటికీ, శస్త్రచికిత్స తర్వాత ఏర్పడిన సమస్యల కారణంగా, బహుశా అవయవ వైఫల్యానికి దారితీసి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అబ్రదీప్ సాహా స్పోర్ట్స్ కు సంబందించిన వీడియోలతో బాగా పేమస్ అయ్యాడు. హార్డ్‌కోర్ ఫుట్‌బాల్ అభిమాని మాత్రమే కాకుండా, అతను క్రికెట్ మరియు సినిమాలను కూడా అనుసరించేవాడు. వాటిపై పలు వీడియోలు చేసి బాగా పాపులర్ అయ్యాడు. అబ్రదీప్ సాహాకు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్‌లో 481k సబ్‌స్క్రైబర్‌లను మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో 119k ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అబ్రదీప్ సాహా ఫిబ్రవరి 19, 1996న కోల్‌కతాలో జన్మించాడు.
We’re now on WhatsApp. Click to Join
అబ్రదీప్ సాహా ఆకస్మిక మరణం అతని కుటుంబం, స్నేహితులు మరియు అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియ జేస్తున్నారు. అబ్రదీప్ సాహా ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సబ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
Also Read: Pawan Kalyan Nomination : పవన్ నామినేషన్ ముహూర్తం ఫిక్స్..