YouTube Fan Channels : ఫ్యాన్ ఛానల్స్ పై యూట్యూబ్ కొరడా.. ఆగస్ట్ 21 నుంచి కొత్త రూల్స్
YouTube Fan Channels : యూట్యూబ్ తన క్రియేటర్‌లను రక్షించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ ఫ్యాన్ ఛానల్స్ కు కళ్లెం వేసేందుకు కొత్త పాలసీని తీసుకొచ్చింది.
- By Pasha Published Date - 01:05 PM, Sat - 24 June 23

YouTube Fan Channels : యూట్యూబ్ తన క్రియేటర్‌లను రక్షించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది.
యూట్యూబ్ ఫ్యాన్ ఛానల్స్ కు కళ్లెం వేసేందుకు కొత్త పాలసీని తీసుకొచ్చింది.
ఈ కొత్త పాలసీకి సంబంధించి YouTube ఒక బ్లాగ్ పోస్ట్ పెట్టింది. దాని ప్రకారం.. ఎవరైనా యూట్యూబ్ ఫ్యాన్ ఛానల్(YouTube Fan Channels) క్రియేట్ చేయాలని భావిస్తే, దానికి అసలు యూట్యూబ్ క్రియేటర్ తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని ఛానల్ హ్యాండిల్ లో డిస్ ప్లే చేయాలి. ఈ పాలసీ ఆగస్ట్ 21 నుంచి అమలులోకి వస్తుంది. ఈ మార్గదర్శకాలను పాటించని ఛానెల్‌లను కంటెంట్ కాపీ కొట్టే ( impersonation) ఛానల్స్ గా పరిగణించి రద్దు చేస్తామని యూట్యూబ్ వార్నింగ్ ఇచ్చింది. ఇతర యూట్యూబ్ ఛానళ్ల పేరు, అవతార్, బ్యానర్ లలో చిన్నపాటి మార్పులు చేసుకొని.. పేరు మధ్యలో గ్యాప్ ఇచ్చి.. పేరులో ఒకే ఒక అక్షరం మార్చేసి నడిపే ఛానల్స్ ను కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ చర్యల ద్వారా తమ నిజమైన ఛానెల్‌లను రక్షిస్తామని తెలిపింది.
Also read : Lab Grown Meat : ల్యాబ్ లో చికెన్ తయారీ.. అమెరికాలో సేల్స్ షురూ
గతంలో YouTube “1080p ప్రీమియం”గా పిలువబడే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. పేరులో ఉన్నట్టుగా.. ఇది ప్రీమియం కేటగిరి వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్‌తో YouTube యాప్‌లోని వినియోగదారుల కోసం యూట్యూబ్ తన 1080p స్ట్రీమింగ్‌ను మెరుగుపరుస్తుంది. తొలివిడతలో ఈ ఫీచర్ ను iOS వర్షన్ కోసమే రిలీజ్ చేశారు. త్వరలో దీన్ని Android వినియోగదారుల కోసం తీసుకురానున్నారు. ఈ అప్‌డేట్ అధిక బిట్‌రేట్ (డేటా బదిలీ వేగం)తో ఉంటుంది.