Emergency landing: సీఎం యోగి హెలికాప్టర్ ను తాకిన పక్షి.. ఆకస్మిక ల్యాండింగ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఆదివారం ఉదయం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు ఓ పక్షి తాకింది.
- By Hashtag U Published Date - 11:13 AM, Sun - 26 June 22

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఆదివారం ఉదయం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు ఓ పక్షి తాకింది. దీంతో హెలికాప్టర్ ను అకస్మాత్తుగా ల్యాండ్ చేశారు. వారణాసి నుంచి లక్నో కు ఆయన బయలుదేరారు. బయలుదేరిన కాసేపటికే హెలికాప్టర్ కు పక్షి ఎదురొచ్చి తాకింది.
దీంతో వారణాసిలోనే హుటాహుటిన హెలికాప్టర్ ను ల్యాండ్ చేశారు. విమానం ద్వారా ఆయన లక్నోకు బయలుదేరి వెళ్తారని తెలుస్తోంది. వాస్తవానికి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఉదయం వారణాసికి వచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. వాటిపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు.వారణాసిలో శాంతిభద్రతల పై పోలీసులతో సమీక్షించారు. శనివారం రాత్రి యోగి వారణాసిలోనే ఉన్నారు. ఆదివారం ఉదయమే రాజధాని లక్నోకు బయలుదేరారు.
Cover Pic: File Pic
https://twitter.com/Journalist_adp/status/1540933431869132800