YCP MP Gurumoorthy : వెంకన్న వేషధారణలో గురుమూర్తి
తిరుపతి ఎంపీ గురుమూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి అవతారం ఎత్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి వేషధారణలో కనిపించిన ఆయన అందరినీ ఆకట్టుకున్నారు.
- By Hashtag U Published Date - 12:15 PM, Mon - 16 May 22

తిరుపతి ఎంపీ గురుమూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి అవతారం ఎత్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి వేషధారణలో కనిపించిన ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. తిరుపతిలో జరుగుతున్న తాతయ్య గుంట గంగమ్మ జాతరలో ఈ దృశ్యం కనిపించింది. జాతరలో భాగంగా ఆదివారం వెంకటేశ్వర స్వామి వేషధారణలో వెళ్లిన గురుమూర్తి గంగమ్మ తల్లికి మొక్కు చెల్లించుకున్నారు.ఈ విషయాన్ని స్వయంగా గురుమూర్తే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తిరుపతి గంగమ్మ జాతరకు చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పిన గురుమూర్తి.. కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా తాతయ్య గుంట గంగమ్మతల్లి జాతర రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు.
తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర లో భాగంగా ఈరోజు వెంకటేశ్వరస్వామి వేషధారణలో వెళ్లి ఆ గంగమ్మ తల్లి కి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. తిరుపతి గంగమ్మ జాతరకు చాలా ప్రాముఖ్యత ఉంది,కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా తాతయ్య గుంట గంగమ్మతల్లి జాతర రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. pic.twitter.com/VeLSd3qQPP
— Maddila Gurumoorthy (@GuruMYSRCP) May 15, 2022