Bihar: దారుణం… టీ అడిగితే ఇవ్వలేదని భార్యపై యాసిడ్ దాడి చేసిన భర్త!
ప్రస్తుత కాలంలో నేరాలు రోజురోజుకు అధికమవుతున్నాయి.చిన్న చిన్న విషయాలకి భార్య భర్తల మధ్య గొడవలు చోటు చేసుకోవడమే కాకుండా ఆ గొడవలు ఏకంగా ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్తున్నాయి.
- Author : Anshu
Date : 16-03-2023 - 9:08 IST
Published By : Hashtagu Telugu Desk
Bihar: ప్రస్తుత కాలంలో నేరాలు రోజురోజుకు అధికమవుతున్నాయి.చిన్న చిన్న విషయాలకి భార్య భర్తల మధ్య గొడవలు చోటు చేసుకోవడమే కాకుండా ఆ గొడవలు ఏకంగా ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. బీహార్ లోని మరౌనా బ్లాక్లోని లాల్మానియా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గ్రామంలో నివసిస్తున్నటువంటి నిందితుడు మద్యం బాటిల్ తో ఇంటికి వచ్చాడు అయితే ముందుగా మద్యం సేవించి తన భార్యతో కలిసి భోజనం చేశాడు.
ఇలా భోజనం చేసిన తర్వాత ఆయన మధ్య మధ్యలో తన భార్యను టీ కావాలని అడగడంతో తన భార్య స్టవ్ పై టీ పెట్టినప్పటికీ మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియక ఆ వ్యక్తి బాత్రూం కడిగే యాసిడ్ తీసుకొని తన భార్యపై దాడి చేశారు. ఇలా యాసిడ్ పడటంతో తన భార్య గట్టిగా అరవడం వల్ల చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ఇలా యాసిడ్ దాడిలో గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి అనంతరం ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే నడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గత మూడు రోజుల క్రితం తన భార్యపై వేడి లేనటువంటి యాసిడ్ దాడి చేయడంతో ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొని ఇంటికి వచ్చింది. తాజాగా మరోసారి తనపై దాడి చేయడంతో పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుడు మద్యం మాదక ద్రవ్యాలకు బానిసవ్వడమే కాకుండా వికలాంగుడు కూడా కావడం గమనార్హం.