London: విమానంలో నిద్రలోనే మరణించిన వృద్ధురాలు
మరణం ఎప్పుడు ఎలా వస్తుందో అంచనా వేయడం అసాధ్యం. అలాగే మరణం నుంచి తప్పించుకోలేము. అయితే అకాల మరణం నిద్రలోనే వస్తుందంటారు. తాజాగా విమానంలో ప్రయాణిస్తున్న 73 ఏళ్ళ వృద్ధురాలు నిద్రలోనే శ్వాస విడిచింది.
- By Praveen Aluthuru Published Date - 03:12 PM, Sat - 23 September 23
London: మరణం ఎప్పుడు ఎలా వస్తుందో అంచనా వేయడం అసాధ్యం. అలాగే మరణం నుంచి తప్పించుకోలేము. అయితే అకాల మరణం నిద్రలోనే వస్తుందంటారు. తాజాగా విమానంలో ప్రయాణిస్తున్న 73 ఏళ్ళ వృద్ధురాలు నిద్రలోనే శ్వాస విడిచింది.
లండన్ లో బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో విషాదం చోటు చేసుకుంది. లండన్ నుంచి నైస్ వెళ్లే ఈ విమానంలో 73 ఏళ్ల వృద్ధురాలు ప్రయాణిస్తుంది. అయితే ఏమైందో ఏమో కానీ ఆమె నిద్రలోనే మృతి చెందింది. వృద్ధురాలిని నిద్ర లేపగా, ఆమె ఎంతసేపటికీ నిద్ర లేవకపోవడంతో ఆందోళన చెందిన ప్రయాణికులు సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది పారామెడిక్స్కు సమాచారం అందించారు. వాళ్ళు వచ్చి పరీక్షలు చేసి చూడగా ఆమె నిద్రలోనే మృతి చెందినట్లు నిర్దారించారు. రాత్రి 10 గంటలకు మహిళ చనిపోయినట్లు ప్రకటించారు. గుండెపోటుతో మరణించినట్లు అనుమానిస్తున్నారు. వృద్ధురాలి మరణాన్ని ధృవీకరిస్తూ, బ్రిటిష్ ఎయిర్వేస్ తెలిపింది.
Also Read: AP : రాబోయే ఎన్నికల్లో జగన్ ఓటుకు రూ.20 వేలు ఇస్తాడు – రఘురామ
Related News
Walking: నిద్రపోయే ముందు వాకింగ్ చేస్తే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా
Walking: కదలకుండా ఉండడం ఆరోగ్యానికి చాలా హానీ చేస్తుంది. అయితే నిద్రపోయే ముందు కొద్దిసేపు నడవడం ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసా. ఆహారం తిన్న తర్వాత నడక చాలా ముఖ్యం. మీరు నిద్రపోయే ముందు నడకను అలవాటుగా చేసుకుంటే అది మీ నిద్ర విధానాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర వస్తుంది. సాయంత్రం నడక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఇది మానసిక స్థితిని కూడా మెరు�