INDIGO: ఇండిగోలో మహిళపై లైంగిక వేధింపులు
విమానాల్లో మహిళలపై వేధింపుల కేసులు ఆగడం లేదు.. ఇప్పటికే ఇలాంటి ఉదాంతాలు చాలానే వెలుగు చూశాయి. ముఖ్యంగా ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి.
- By Praveen Aluthuru Published Date - 12:45 PM, Mon - 11 September 23

INDIGO: విమానాల్లో మహిళలపై వేధింపుల కేసులు ఆగడం లేదు.. ఇప్పటికే ఇలాంటి ఉదాంతాలు చాలానే వెలుగు చూశాయి. ముఖ్యంగా ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా మరో ఉదాంతం చోటుచేసుకుంది. ముంబై నుంచి గౌహతి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలిని వేధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో విమానం గౌహతిలో ల్యాండ్ అయిన తర్వాత నిందితుడిని అస్సాం పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన సెప్టెంబర్ 10న ఫ్లైట్ నంబర్ 6E 5319లో జరిగింది. అవసరమైన చోట దర్యాప్తులో సహకరిస్తామని ఇండిగో ప్రతినిధి తెలిపారు. మహిళ నుంచి ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపారు. గతంలో దుబాయ్ నుంచి అమృత్‌సర్ వెళుతున్న విమానంలో కూడా వేధింపుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న విమానంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి విమానంలోని మహిళా సిబ్బందిని వేధించాడు. అయితే విమానం అమృత్ సర్ చేరుకోగానే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Also Read: Kamal Haasan: బీజేపీ వ్యతిరేక శక్తులతో కమల్ ప్రయాణం..