Hyderabad: నాలాలో పడి మహిళ మృతి
హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలు డ్రైనేజీలు పొంగి పొర్లాయి. అది గమనించని మహిళా నాలాలో పడి ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె మృతి చెందినట్లు పోలీసులు నిర్దారించారు.
- By Praveen Aluthuru Published Date - 12:13 AM, Fri - 29 September 23

Hyderabad: హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు డ్రైనేజీలు పొంగి పొర్లాయి. అది గమనించని మహిళ నాలాలో పడి ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె మృతి చెందినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ రోజు సాయంత్రం సమయంలో కురిసిన భారీ వర్షానికి ప్రమాదవశాత్తు నాలాలో పడి ఓ మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మహిళ కాలువను దాటేందుకు ప్రయత్నించగా అందులో పడి కొట్టుకుపోయిందని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మహిళ కోసం సహాయక చర్యలు చేపట్టారు. ఆమె మృతదేశం లభ్యమవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రసిద్ధ స్కందగిరి ఆలయంలో భిక్షాటన చేసేదని, విచారణ తర్వాత అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
నాలాలో పడి మరణించడం ఇదే కొత్త కాదు. నగరంలో ఇలాంటి ఘటనలు ఎన్నో పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఎంతో మంది అమాయకులు డ్రైనేజి ప్రమాదానికి గురై చనిపోతున్నారు. డ్రైనేజి ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ మాటల వరకే పరిమితం అవుతున్నాయి. చేతల్లో చూపించకపోవడంతో నిత్యం నగరంలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
Also Read: The Journey of Bhagavanth Kesari : ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చిన బాలకృష్ణ
Related News

Praja Darbar 2nd Day : రెండోరోజు కూడా ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున పోటెత్తిన ప్రజలు
రెండో రోజు కూడా ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు.