The Journey of Bhagavanth Kesari : ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చిన బాలకృష్ణ
8 నెలలు పాటు 24 అద్భుత లొకేషన్స్‌లో 12 భారీ సెట్స్ వేసి మూవీ షూటింగ్ జరిపినట్లు పేర్కొన్నారు. శ్రీలీల, కాజల్, అర్జున్ రాంపాల్, బాలయ్యపై అనిల్ రావిపూడి చిత్రీకరించిన సీన్స్‌ను
- By Sudheer Published Date - 10:08 PM, Thu - 28 September 23

అఖండ , వీరసింహారెడ్డి వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ (Balakrishna) నుండి వస్తున్న మూవీ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ చిత్రానికి డైరెక్టర్ అవ్వడం..మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ శ్రీ లీల ఈ మూవీ లో బాలయ్య కు కూతురిగా నటిస్తుండడం తో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా టీజర్ , స్టిల్స్ , మేకింగ్ వీడియోస్ వంటివి ఆసక్తి రేపగా..తాజాగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్ర షూటింగ్ అంత పూర్తి అయినట్లుగా తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేసారు. ‘ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి’ (The Journey of Bhagavanth Kesari ) పేరుతో.. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకు సెట్లో జరిగిన మేకింగ్ వీడియోను అభిమానులకు పంచుకున్నారు.
Read Also :Laddu Auction: గణేష్ లడ్డును వేలంలో రూ.1.2 లక్షలకు దక్కించుకున్న ముస్లిం యువకుడు
8 నెలలు పాటు 24 అద్భుత లొకేషన్స్‌లో 12 భారీ సెట్స్ వేసి మూవీ షూటింగ్ జరిపినట్లు పేర్కొన్నారు. శ్రీలీల, కాజల్, అర్జున్ రాంపాల్, బాలయ్యపై అనిల్ రావిపూడి చిత్రీకరించిన సీన్స్‌ను, ఇతర మూవీటీమ్ సినిమా కోసం ఎంతలా కష్టపడిందో ప్రతీది చూపించారు. యాక్షన్ సన్నివేశాల మేకింగ్‌ను కూడా చూపించారు. ఇక ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మరో లెవెల్లో ఉంది. వీడియో చివర్లో ‘కలిసి మాట్లాడుతా అన్న కదా… అంతలోనే మందిని పంపాలా… గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే’ అంటూ బాలయ్య డైలాగ్ చెప్పడం వీడియో కు హైలైట్ గా నిలిచింది. మరి సినిమాలో ఇంకెన్ని ఇలాంటి భారీ డైలాగ్స్ ఉన్నాయో చూడాలి. దసరా కానుకగా అక్టోబర్ 19న సినిమా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.