Hyderabad: పెరగనున్న పెట్రోల్ డీజిల్ ధరలు
పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. కరోనా తరువాత ఆర్థికంగా సామాన్య ప్రజలు చితికిపోయారు.
- By Praveen Aluthuru Published Date - 01:57 PM, Thu - 7 September 23

Hyderabad: పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. కరోనా తరువాత ఆర్థికంగా సామాన్య ప్రజలు చితికిపోయారు. అలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు అండగా ఉండాల్సింది పోయి అధిక భారాన్ని మోపారు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు.అందులో భాగంగా పెట్రోల్ డీజిల్ పై రేట్లు పెంచారు. ఇదిలా ఉండగా మరోసారి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగనున్నట్టు తెలుస్తుంది.
రష్యా, సౌదీ అరేబియా సరఫరా కోతలను విరమించుకోకపోతే ముడి చమురు ధరలు మూడింతల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ హెచ్చరించింది. దాంతో హైదరాబాద్‌తో పాటు భారతదేశంలోని ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. సౌదీ అరేబియా తన ఉత్పత్తిపై సుంకాన్ని ఈ సంవత్సరం చివరి వరకు పొడిగించనున్నట్లు ప్రకటించినందున చమురు ధరలు పెరగనున్నాయి. రష్యా కూడా ఎగుమతి టాక్స్ రోజుకు 300,000 బ్యారెళ్లను పొడిగించనున్నట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో ముడి చమురు ధరలు మరింత పెరగడానికి దారితీశాయి, తద్వారా హైదరాబాద్ మరియు భారతదేశంలోని ఇతర నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు:
హైదరాబాద్ రూ. 109.66 రూ. 97.82
ఢిల్లీ రూ. 96.72 రూ. 89.62
ముంబై రూ. 111.35 రూ. 97.28
కోల్‌కతా రూ. 106.03 రూ. 92.76
చెన్నై రూ. 102.63 రూ. 94.24.
Also Read: Raai Laxmi Pics: బీచ్ లో రచ్చ చేస్తున్న రత్తాలు, బ్లాక్ లేస్ బికినీ తో గ్లామర్ ట్రీట్