చంద్రబాబు కు సుప్రీం కోర్ట్ లోనే న్యాయం జరుగుతుందా..?
ఇప్పటికైనా చంద్రబాబు తరుపు లాయర్లు మేల్కొని..సుప్రీం కోర్ట్ బాట పడితే మంచిది
- By Sudheer Published Date - 05:55 PM, Tue - 12 September 23

స్కిల్ డెవలప్ కేసు (Skill Development Case)లో అరెస్ట్ అయినా టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) కు ఇప్పట్లో బెయిల్ (Chandrababu Bail)వస్తుందా..? అంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే బెయిల్ సంగతి అటుంచి..జైల్లో ప్రాణ హాని..ఉంది ఆయన్ను హౌస్ రిమాండ్ కు ఆదేశాలు ఇవ్వాలని రెండు రోజులుగా లాయర్లు కోరుతున్న ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ హిమబిందు మాత్రం అస్సలు అలాంటిదేమీ లేదు. చంద్రబాబు జైల్లో ఉండాల్సిందే అన్నట్లు తిరస్కరిస్తుంది. దీంతో చేసేదేం లేక చంద్రబాబు తరుపున లాయర్లు హైకోర్టు కు వెళ్లాలని అనుకుంటున్నారు. కానీ అక్కడ కూడా చంద్రబాబు కు తిరస్కరణే వస్తుందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అంటున్నారు.
ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ హిమబిందు లాయర్ల పిటిషన్ తిరస్కరిస్తుందని అయన సోమవారమే ఓ మీడియా ఛానల్ లో చెప్పారు. ‘‘చంద్రబాబు హౌస్ అరె్‌స్టకు ఏసీబీ కోర్టు అనుమతి ఇస్తుందన్న నమ్మకం నాకు లేదు. అలాగే హైకోర్టులో న్యాయం జరుగుతుందని నేను భావించడం లేదు. చంద్రబాబు న్యాయవాద బృందం వీలైనంత త్వరగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలి..లేదంటే చంద్రబాబు ప్రాణానికి ముప్పు ‘ అని రఘు రామ అన్నారు. గతంలో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసులో అరెస్ట్ అయిన వారిని సాక్ష్యాలు రూపుమాపడానికి జైలులోనే హత్య చేసిన ఘటనలను చూశాం. తనను కూడా గుంటూరు జైలులో హత్య చేయాలని పథక రచన చేశారు. మూడు నాలుగు రోజులపాటు జైలులోనే ఉంటే నన్ను కచ్చితంగా హత్య చేసి ఉండేవారు’’ అని రఘురామ చెప్పుకొచ్చారు.
Read Also : House Remond rejected : జైలులో చంద్రబాబు ఎన్నాళ్లు..? ఏసీబీ కోర్టులో ఏం జరుగుతోంది.?
అలాగే చంద్రబాబుపై మరిన్ని కేసులు నమోదు చేసే ఛాన్స్ ఉంది.. టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు టీడీపీ సీనియర్లంతా తమ పైనున్న కేసుల్లో ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేసుకోవాలి. త్వరలోనే నారా లోకేశ్‌ను అరెస్టు చేస్తామని మాజీ మంత్రులతో పాటు, ప్రస్తుత మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం చూస్తుంటే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ప్లాన్‌లో జగన్ ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని రఘురామ అన్నారు. ఆయన అన్నట్లే ఈరోజు ఏసీబీ కోర్ట్ లో జడ్జ్ హౌస్ రిమాండ్ పిటిషన్ ను తిరస్కరించారు. అలాగే చంద్రబాబు ఫై మరికొన్నికేసులు మోపేందుకు చూస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తరుపు లాయర్లు మేల్కొని..సుప్రీం కోర్ట్ బాట పడితే మంచిది. అప్పుడే చంద్రబాబు కు బెయిల్ వస్తుంది..ఈ కేసు నుండి బయటపడతారు.