Triple Talaq: ఆ దేశాల్లో ట్రిపుల్ తలాక్ ఎందుకు నిషేధించారు?: ప్రధాని మోడీ
భోపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ వివాదాస్పద అంశం ట్రిపుల్ తలాక్ పై మాట్లాడారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన భారతీయ జనతా పార్టీ మేరా బూత్
- Author : Praveen Aluthuru
Date : 27-06-2023 - 5:22 IST
Published By : Hashtagu Telugu Desk
Triple Talaq: భోపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ వివాదాస్పద అంశం ట్రిపుల్ తలాక్ పై మాట్లాడారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన భారతీయ జనతా పార్టీ మేరా బూత్, సబ్సే శక్తి కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ట్రిపుల్ తలాక్ గురించి కూడా ప్రస్తావించారు. ట్రిపుల్ తలాక్ వల్ల కూతుళ్లకు అన్యాయం జరగడమే కాకుండా మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తుందని ప్రధాని అన్నారు. ట్రిపుల్ తలాక్ ఇస్లాంలో అంతర్భాగమైతే పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్ వంటి ముస్లిం దేశాల్లో ఎందుకు నిషేధించారని ఆయన అన్నారు.
భారతదేశంలో ట్రిపుల్ తలాక్ చట్టం 19 సెప్టెంబర్ 2018 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పడం చట్టవిరుద్ధం. ఏ ముస్లిం వ్యక్తి తన భార్యకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ ఇవ్వలేడు. వారెంట్ లేకుండానే పోలీసులు నిందితులను అరెస్టు చేయవచ్చు. ట్రిపుల్ తలాక్ చట్టం ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష, లేదా జరిమానా ఉంటుంది. ఒక్కోసారి ఆ రెండు శిక్షలు అమలవుతాయి.
Read More: Modi new slogan : ఎన్నికల టార్గెట్ గా కవిత, పార్టీలన్నీ ఆమె వైపే బాణాలు!!