Nitrogen Gas Execution : ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్ష
Nitrogen Gas Execution : నైట్రోజన్ గ్యాస్ ఇచ్చి ఓ ఖైదీకి మరణ శిక్ష విధించారు.
- By Pasha Published Date - 02:07 PM, Fri - 26 January 24
Nitrogen Gas Execution : నైట్రోజన్ గ్యాస్ ఇచ్చి ఓ ఖైదీకి మరణ శిక్ష విధించారు. ఇలా చేయడం ప్రపంచంలోనే తొలిసారి!! సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి నుంచి విమర్శలు ఎదురైనా అమెరికాలోని అలబామా రాష్ట్ర సర్కారు ఈ శిక్షను ముందుగా నిర్ణయించిన టైం ప్రకారం అమలు చేయించింది. ఓ మహిళను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన 58 ఏళ్ల యూజీన్ స్మిత్ ఫేస్‌మాస్క్ ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్‌ను పీల్చి ప్రాణాలు వదిలాడు. నైట్రోజన్ గ్యాస్ పీల్చిన కొన్ని సెకన్లలోనే యూజీన్ స్మిత్ స్పృహ కోల్పోయాడు. నిమిషాల్లోనే మరణం సంభవించింది. నొప్పి లేకుండా, అత్యంత మానవీయంగా అమలు చేసే మరణ శిక్ష(Nitrogen Gas Execution) ఇదేనని అలబామా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. మరణశిక్ష అమలైన విషయాన్ని అలబామా జైలు అధికారులు కూడా వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ తరహా కఠిన శిక్షలు అమెరికాలో చాలా ఏళ్ల నుంచే అమల్లో ఉన్నాయి. మరణశిక్ష పడిన ఖైదీలకు 1982 నుంచే ఈ దేశంలో ప్రాణాంతక ఇంజెక్షన్‌తో శిక్షణ అమలు చేస్తున్నారు. 2022 సంవత్సరంలో యూజీన్ స్మిత్‌కు కూడా ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు చేయాలని భావించారు. అయితే అతడి నరాలకు ఇంజెక్షన్‌కు సంబంధించిన IV లైన్ అనుసంధానం కాలేదు. దీంతో అతడికి ఇంజెక్షన్ ఇవ్వడాన్ని చివరి నిమిషంలో ఆపేశారు. దీంతో ఇప్పుడు అతడికి నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్ష విధించారు.
Also Read :Ram Lalla With BrahMos : బ్రహ్మోస్ క్షిపణితో అయోధ్య రాముడు.. రిపబ్లిక్ డేలో స్పెషల్ శకటాలు
కొత్తకొత్త మరణ శిక్ష పద్ధతులను టెస్ట్ చేసేందుకు తనను ఒక సాధనంగా వాడుకుంటున్నారని పేర్కొంటూ యూజీన్ స్మిత్ అలబామా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. క్రూరమైన శిక్షలపై ఉన్న రాజ్యాంగపరమైన నిషేధాన్ని ఈ నిర్ణయం ఉల్లంఘిస్తోందని అతడు వాదన వినిపించాడు. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. శిక్ష అమలును అడ్డుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో అతడికి నైట్రోజన్ గ్యాస్ ఇచ్చి శిక్షను అమలు చేశారు. 1988లో మత బోధకుడు చార్లెస్ సెన్నెట్ తన భార్యను హత్య చేయాలని బిల్లీ గ్రే విలియమ్స్‌కు డబ్బు ఇచ్చాడు. బిల్లీ తన స్నేహితులైన యూజీన్ స్మిత్, పార్కర్ల సాయంతో చార్లెస్ భార్య ఎలిజిబెత్‌ను హత్య చేశాడు. తర్వాత పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో చార్లెస్ ఆత్మహత్య చేసుకోగా, విలియమ్స్‌కు యావజ్జీవ ఖైదు పడింది. స్మిత్, పార్కర్‌లకు మరణశిక్ష పడింది. విలియమ్స్ జైల్లోనే అనారోగ్యంతో చనిపోగా పార్కర్‌కు ఇంజక్షన్ ఇచ్చి మరణదండన అమలు చేశారు. ఇప్పుడు యూజీన్ స్మిత్‌కు నైట్రోజన్ హైపోక్సియా పద్ధతిలో మరణశిక్ష అమలు చేశారు.
Related News
Death Execution: 20 ఏళ్లలో తొలిసారిగా మహిళకు ఉరిశిక్ష.. ఎక్కడో తెలుసా?
మాములుగా తప్పు చేసినప్పుడు శిక్ష వేయడం అన్నది కామన్. కొన్ని కొన్ని సార్లు ఉరిశిక్ష కూడా వేస్తూ ఉంటారు. అయితే ఉరిశిక్షలు వేయడం అన్నది చాలా అ