BRS Minister: సచ్చేదాకా సార్ తోనే ఉంటాం!
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం జేస్ రాం తండా వాసులు ప్రమాణం చేశారు.
- Author : Balu J
Date : 07-09-2023 - 11:13 IST
Published By : Hashtagu Telugu Desk
BRS Minister: సచ్చేదాకా సార్ తోనే ఉంటాం… సావైనా రేవైనా దయన్నతోనే… అంటూ వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం జేస్ రాం తండా వాసులు ప్రమాణం చేశారు. జేస్ రాం తండా సహా ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని రావుల తండా, విద్యానగర్ తండాలకు చెందిన 70 మంది ఆయా తండాల పెద్ద మనుషులు, ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని సంగెం మండలం కాపుల కనపర్తిలో కలిశారు.
ఈ సందర్భంగా వారు బిల్లా సుధీర్ రెడ్డి, ఆకుల సురేందర్ రావుల నాయకత్వంలో మంత్రిని కలిసి తమ మద్దతు తెలిపారు. తాము మొదటి నుంచీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోనే ఉన్నామని, భవిష్యత్తులోనూ ఆయనతోనే ఉంటామని, సచ్చేదాకా సార్ తోనే… సావైనా రేవైనా దయన్నతోనే.. అంటూ ప్రమాణం చేశారు. వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపిన మంత్రి, వారి రుణం తీర్చుకునే విధంగా వారికి సేవ చేస్తానని హామీ ఇచ్చారు.
Also Read: Stock Market Opening: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..!