Viral Pic : చింపాంజీతో రణబీర్ కపూర్…షాకైన ఫ్యాన్స్..!!
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీ మంచి టాక్ సాధించడంతో..కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇఛ్చాడు.
- Author : hashtagu
Date : 15-10-2022 - 8:42 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీ మంచి టాక్ సాధించడంతో..కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇఛ్చాడు. త్వరలోనే తండ్రి కూడా కాబోతున్నారు రణబీర్ కపూర్. భార్య అలియాతో కలిసి తన బిడ్డకు స్వాగతం పలికేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా చింపాంజీతో కలిసి రణబీర్ కపూర్ ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. ఇది చూసిన ఆయన అభిమానులు షాక్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం క్యాట్ ఎడ్వర్డ్ తో అలియా ఫొటో దిగితే…ఇప్పుడు రణబీర్ కపూర్ చింపాంజీతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియలో షేర్ చేశాడు. దీంతో ఆయన అభిమానులు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక గందరగోళంలో పడ్డారు.
Can you guess, what's cooking?👀#RanbirKapoor pic.twitter.com/jixTzMce51
— Ranbir Kapoor Universe (@RanbirKUniverse) October 13, 2022
అయితే రణబీర్ కపూర్…తదుపరి ప్రాజెక్టు కు సంబంధించి షేర్ చేసిన ఫోటోనా లేదా మరేదైనా అని అయోమయంలో పడ్డారు అభిమానులు. ఇది ప్రాజెక్ట్ కోసం లుక్ పరీక్షనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏం జరుగుతోంది…ఈ చిత్రాలు ఎక్కడివి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అంతేకాదు చింపాంజీతోపాటు బ్రాందీ బాటిల్ కూడా ఉందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఏదైనా బ్రాందీ యాడ్ కావచ్చంటూ ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించాడు. మొత్తానికి రణబీర్ కపూర్ షేర్ చేసిన ఈ ఫొటో ఆయన అభిమానులకు పెద్ద పరీక్షే పెట్టింది. అయితే ఈ ఫొటో ఎందుకు అనేది త్వరలోనే తేలనుంది.