Vegetable Salad: పిల్లలు ఎంతగానో ఇష్టపడే వెజిటబుల్ సలాడ్.. ఇలా చేస్తే కొంచెం కూడా మిగల్చరు?
మామూలుగా మనం వంటింట్లో దొరికే కూరగాయలన్నింటితో కలిపి చాలా తక్కువ రెసిపీ లు ట్రై చేస్తూ ఉంటాం. కొన్ని రకాల కూరల్లో ఐదారు రకమైన కూరగాయలు కూడా
- By Anshu Published Date - 08:30 PM, Tue - 9 January 24

మామూలుగా మనం వంటింట్లో దొరికే కూరగాయలన్నింటితో కలిపి చాలా తక్కువ రెసిపీ లు ట్రై చేస్తూ ఉంటాం. కొన్ని రకాల కూరల్లో ఐదారు రకమైన కూరగాయలు కూడా ఉపయోగిస్తూ ఉండవు. కూరగాయలన్నింటినీ ఉపయోగించి వెజిటేబుల్ పరాటా, వెజిటేబుల్ రైస్, వెజిటేబుల్ పులావ్, వెజిటేబుల్ సూప్ వంటివి తయారు చేసుకొని తింటూ ఉంటారు. అయితే వెజిటేబుల్ సలాడ్ ని ట్రై చేసారా. ఎప్పుడు తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వెజిటబుల్ సలాడ్ కు కావలసిన పదార్థాలు:
కీరదోసకాయ ముక్కలు – 1/2 కప్పు
క్యారెట్ ముక్కలు – 1/2 కప్పు
బీట్రూట్ – 1/4 కప్పు
క్యాబేజీ ముక్కలు – 1/4 కప్పు
టమోటో ముక్కలు – 1/2 కప్పు
ఉల్లిపాయ ముక్కలు – 1/2 కప్పు
కొత్తిమీర – 2 స్పూన్స్
పచ్చిమిర్చి – 4 లేదా 6
వెనిగర్ – 1 స్పూన్
నిమ్మరసం – 2 స్పూన్స్
ఉప్పు- రుచికి తగినంత
వెజిటబుల్ సలాడ్ తయారీ విధానం:
ముదుగా ఈ సలాడ్ తయారు చేయటం కోసం కూరగాయలన్నిటిని సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి. మొదటగా కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక బౌల్ తీసుకొని అందులో అన్నిరకాలు కూరగాయ ముక్కులు వేసి, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర ముద్దను వేసి ముక్కలకు బాగా పట్టేలా మరొకసారి కలపాలి. చివరగా వెనిగర్, నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేయాలి. పైన కూడా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలు వెజిటబుల్ సలాడ్ రెడీ.