HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Speed News News
  • ⁄Vande Bharat Train Runs These Are The Timings Of Six Days In A Week

Vande Bharath: వందేభారత్ రైలు పరుగులు.. వారంలో ఆరు రోజుల టైమింగ్స్ ఇవే!

ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

  • By Nakshatra Published Date - 10:07 PM, Fri - 13 January 23
Vande Bharath: వందేభారత్ రైలు పరుగులు.. వారంలో ఆరు రోజుల టైమింగ్స్ ఇవే!

Vande Bharath:  ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వందేభారత్ రైలు తెలుగు నేలపై పరుగులు పెట్టనుంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ రైలు ఎనిమిదోది కావడం విశేషం. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు రాకపోకలు జరగనున్నాయి. ఒక ఆదివారం తప్పా వారానికి 6 రోజుల పాటు ఈ రైలు సర్వీసులు ఉంటాయని అధికారులు తెలిపారు.

జనవరి 15వ తేది ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వందేభారత్ ట్రైన్ ను వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించే కార్యక్రమం జరగనుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20833 ఉంది. అలాగే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకూ రైలు నెంబరు 20834 వెళ్లనుంది. విశాఖపట్నం నుంచి రైలు ఉదయం 5.45 గంటలకు బయల్దేరి మధ్యలో రాజమండ్రికి 7.55కు చేరుకుంటుంది. ఆ తర్వాత విజయవాడ 10.00, ఖమ్మం 11.00, వరంగల్ 12.05, సికింద్రాబాద్ 14.15 గంటలకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

మళ్లీ సికింద్రాబాద్ నుంచి 15.00 గంటలకు అంటే మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వరంగల్ కు 16.35, ఖమ్మం 17.45, విజయవాడ 19.00, రాజమండ్రి 20.58, విశాఖపట్నం 23.30 గంటలకు చేరుకోనుంది. తిరిగి మళ్లీ ఉదయం సర్వీసు యథావిధిగా ప్రారంభం కానుంది. ఒక్క ఆదివారం తప్ప మిగతా రోజుల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.

తెలుగు రాష్ట్రాల మధ్య నడవనున్న వందే భారత్ రైలు కోసం ముందే ఖరారు చేసిన షెడ్యుల్ లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం ప్రజల ఒత్తిడి నేపథ్యంలో కొత్తగా ఖమ్మం స్టేషన్‌లో వందేభారత్ రైలును ఆపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ రైలుకు 18 బోగీలు ఉండగా అందులో ప్రైమరీ మెయింటెనెన్స్ విశాఖపట్నంలోనే ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

Telegram Channel

Tags  

  • indian railways
  • secunderabad
  • Vande Bharath
  • Vandebharath Express
  • Visakhapatnam

Related News

Fire Breaks Out: సికింద్రాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం

Fire Breaks Out: సికింద్రాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌ప‌ల్లిలోని శ్రీ లా హాట్స్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం (Fire Breaks Out) జరిగింది. బీ బ్లాక్‌లోని ఏడో అంత‌స్తులో ఓ ఇంట్లోని పూజ గ‌దిలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. పూజ గ‌దిలో వెలిగించిన దీపం ద్వారా మంట‌లు అంటుకున్నాయి.

  • Three More Vande Bharat Trains: తెలంగాణకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు

    Three More Vande Bharat Trains: తెలంగాణకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు

  • Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ముగ్గరు సజీవ దహనం!

    Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ముగ్గరు సజీవ దహనం!

  • Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

    Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

  • Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణ చార్జీ ఎంతో తెలుసా..?

    Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణ చార్జీ ఎంతో తెలుసా..?

Latest News

  • U19 Women T20 World Cup 2023: నేడు ఇంగ్లాండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. అడుగు దూరంలో టీమిండియా..!

  • Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ

  • Who Is Raja Chari: భారత సంతతికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి.. ఎవరీ రాజా జె చారి..?

  • Taliban Bans: మహిళలపై మరో నిషేధం విధించిన తాలిబన్లు.. ఈసారి ఏంటంటే..?

  • Bachula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: