US President Joe Biden : అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ షాకింగ్ కామెంట్స్.. తనకు…?
అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు క్యాన్సర్ ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే దానిపై ఇతర వివరాలేవీ బయటపెట్టలేదు.
- By Prasad Published Date - 10:48 PM, Thu - 21 July 22

అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు క్యాన్సర్ ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే దానిపై ఇతర వివరాలేవీ బయటపెట్టలేదు. బిడెన్ ఈ వ్యాఖ్యలు చేయగానే ప్రపంచ దేశాల్లో దీనిపై చర్చ మొదలైంది. అమెరికా అధ్యక్షుడికి క్యాన్సర్ వచ్చిదంటూ వివిధ దేశాల్లో పలువురు నేతలు చర్చించుకోవడం మొదలుపెట్టారు. అమెరికాలోనూ అధ్యక్షుడి ఆరోగ్యంపై ఆరా తీయడం మొదలుపెట్టారు. తాజాగా గ్లోబల్ వార్మింగ్, తాను పెరిగిన పరిసరాల్లోని చమురు శుద్ధి కర్మాగారాల నుండి వెలువడే ఉద్గారాల గురించి మాట్లాడుతున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనలో క్యాన్సర్ గురించి చేసిన ప్రస్తావన ఇందుకు కారణమైంది. జోబిడెన్ త్వరగా కోలుకోవాలని చాలా మంది ప్రార్ధనలు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ వివరణ దీనిపై వివరణ ఇచ్చింది. బైడెన్ గత సంవత్సరం పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు తాను చేయించుకున్న చర్మ క్యాన్సర్ చికిత్స గురించి ప్రస్తావిస్తూ ఈ ప్రకటన చేశారని అధ్యక్ష నివాసం ఆ తర్వాత స్పష్టత ఇచ్చింది.
Did Joe Biden just announce he has cancer?
“That’s why I — and so damn many other people I grew up with — have cancer.” pic.twitter.com/lkm7AHJATX
— RNC Research (@RNCResearch) July 20, 2022